Telangana Inter Student Suicide Note Goes Viral in Social Media Tag with Minister KTR : తెలంగాణలో తాజాగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ (2020-21) రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ ఇయర్ లో 49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్ బోర్డు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటా అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
గణేశ్ రూపానీ (Ganesh Rupani).. ఐయామ్ గణేశ్123 (@im_ganesh123) అనే హ్యాండిల్ నుంచి ట్విట్టర్‌లో ఈ పోస్ట్ షేర్ అయ్యింది. గాయ్స్..నేను 4 సబ్జెక్ట్‌లు ఫెయిల్ అయ్యాను అంటూ పోస్ట్ చేశాడు గణేశ్.
సార్ ఏం రాసిన పాస్ చేస్తా అని చెప్పి ఇప్పుడు అందరీని ఫెయిల్ చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు గణేశ్ రూపానీ. అంతేకాదు తాను ఇప్పుడే సూసైడ్ చేసుకోబోతున్న అంటూ పోస్ట్‌లో పేర్కొన్నాడు. నా ఆత్మహత్యకు మీరే కారణమని తెలుపుతూ మంత్రి కేటీఆర్, (minister ktr) అలాగే మంత్రి సబితా ఇంద్రారెడ్డిలను ట్యాగ్ చేశాడు.
Also Read : Etela Rajender press meet: కేసీఆర్‌పై పోటీకి సిద్ధం.. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
రిప్ మీ #RipMe బ్యాన్ టీఎస్ గవర్నమెంట్ #BanTSGovt అనే హ్యాష్ ట్యాగ్‌లతో ఈ ట్వీట్ పోస్ట్ అయ్యింది. అలాగే రూపానీ గణేశ్ తన మార్క్ లిస్ట్‌లను కూడా పోస్ట్స్‌కు అటాచ్ చేశాడు. కేవలం తెలుగు, ఇంగ్లిష్‌లో పాస్ అయ్యినట్లు మిగతా సబ్జెక్ట్‌లలో ఫెయిల్ అయినట్లు అందులో ఉంది. బాట్నీ,జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫెయిల్ అయ్యాడు గణేశ్ రూపానీ. మరి ఈ తెలంగాణ ఇంటర్ బైపీసీ స్టూడెంట్ పోస్ట్ పై గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అలాగే గణేశ్ రూపానీ ఆత్మహత్య (suicide) చేసుకోకుండా వెంటనే అడ్డుకోవాల్సి ఉంది. ఆ విద్యార్థికి వెంటనే ధైర్యం చెప్పి ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ట్వీట్ కొద్ది నిమిషాల్లోనే డిలీట్ అయ్యింది.
Also Read : Guess Who is She: ముద్దులొలికే ఈ చిన్నారి.. మలయాళంలో టాప్ హీరోయిన్ తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook