Election Commission Removed Over 5.41 lakh Voters In Hyderabad: కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ స్థానాలకు గాను ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇప్పటికే తెలంగాణలో కూడా ఎన్నికల నిర్వహాణకు అన్నిరకాల చర్యలు తీసుకున్నట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర భద్రత దళాలు, రాష్ట్ర పోలీసులు సమన్వయం చేసుకుని అధికారులు బందోబస్తును చూస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 60 కంపెనీల బలగాలు వచ్చాయని తెలిపారు. గురువారం ఒక్కరోజు 42 మంది అభ్యర్థులు 46 సెట్ల నామినేషన్న లు దాఖలు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ లో బీఆర్ కే భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడారు.
తెలంగాణలో..ప్రతివెయ్యి పురుష ఓటర్లకు 1,010 మంది మహిళా ఓటర్లు నమోదయ్యాయని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం ౩,౩1,48,527 మంది ఓటర్లు నమోదయ్యారని అన్నారు. అదే విధంగా.. 18 నుంచి 19 ఏళ్ల యువ ఓటర్లు 9,01,942 మంది, పెద్దవారు 1,93,641, దివ్యాంగులు 5,27,034 మంది ఉన్నారని తెలిపారు. మరోవైపు ఇంటినుంచి ఓటు హక్కు సదుపాయం ఉపయోగంచుకునే వయోజనులు, దివ్యాంగులు ఈనెల 23 వరకు దరఖాస్తు చేసుకొవాల్సి ఉంటుదని తెలిపారు.
హైదరాబాద్ విషయానికి వస్తే.. ఇక్కడ ఓటర్ల జాబితా నుండి 5.41 లక్షల మంది ఓటర్లు తొలగించబడినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన, మారిన, నకిలీతో సహా మొత్తం 5.41 లక్షల మంది ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో మే 13న నాల్గవ దశలో ఓటింగ్ జరగనుంది. ఈ స్థానం బీజేపీకి చెందిన మాధవి లత, AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీపై ఆసక్తికర పోటీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?
ఈ విషయంపై జిల్లా ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల యంత్రాంగం ఓటర్ల జాబితా స్వచ్ఛతకు కృషిచేస్తోందని, ఎన్నికలు నిష్పక్షపాతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోల్ షెడ్యూల్ ప్రకారం, పోలింగ్ స్టేషన్‌లు అందుబాటులో ఉండే ప్రాంతాల్లోనే కాకుండా అన్ని ECI నిబంధనలకు కట్టుబడి ఉండేలా చూసేందుకు చిత్తశుద్ధి గల ప్రయత్నాలు చేస్తుందన్నారు. జనవరి 2023 నుండి, హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో, మొత్తం 47,141 మంది ఓటర్లు చనిపోయినట్లు గుర్తించారు. ఇక.. 4,39,801 "బదిలీ ఓటర్లు" గా ఉన్నారు. మొత్తంగా హైదరాబాద్ లో 5.41 లక్షల ఓటర్లను ఈసీ తొలగించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook