Telangana Ministers On Chandrababu Naidu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖమ్మంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి హారీష్ రావు స్పందించారు. చంద్రబాబు షో చూస్తుంటే.. కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీస్తానన్నట్లు ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. చచ్చిన బఱ్ఱె కుండెడు పాలు ఇచ్చినట్లుంది చంద్రబాబు తీరని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల పాలు చేసి ఓటర్ల ఛీత్కారానికి గురైంది చంద్రబాబు కాదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ను అత్యంత వెనకబడేలా చేసింది చంద్రబాబేనని అన్నారు. ఆయన పట్ల తెలంగాణ ప్రజలకు పూర్తి స్పష్టత ఉందన్నారు.
'సూర్యుడు ఉదయిస్తోంది తన వల్లే, కోడి కూస్తోంది తన వల్లే అని అనే బాపతు చంద్రబాబు. చంద్రబాబులా మాట్లాడితే తమ దేశంలో అయితే జైలుకు పంపుతారని అప్పటి స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అన్నారు. రైతులను నిండా ముంచింది చంద్రబాబు కాదా..? కరెంటు చార్జీలు తగ్గించమంటే బషీర్ బాగ్‌లో రైతులను పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపారు. సాగు నీటి ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణను ఎండబెట్టింది చంద్రబాబు. వ్యవసాయం దండగ అన్నది ఆయనే కదా. 2004లో తమ ఓటమికి రైతులను నిర్లక్ష్యం చేయడమే కారణమని బాబు అన్నారు మరచిపోయారా..? బాబు మరచిపోయినా తెలంగాణ ప్రజలు మరచిరు. ఏపీలో చెల్లని రూపాయి చంద్రబాబు తెలంగాణలో చెల్లుతుందా..?' అని హారీష్ రావు అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో టీడీపీ పొత్తు కోసమే తెలంగాణలో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. చంద్రబాబుది భస్మాసుర హస్తం అని.. ఆయనతో పెట్టుకుంటే మాటాషే అని న్నారు. 2018లో తెలంగాణపై మహాకూటమితో కుట్ర చేశారని.. ఇపుడు ఖమ్మం సభతో కుట్ర చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మెడలు వంచి అప్పట్లో జై తెలంగాణ అనిపించామని.. బాబుతో తెలంగాణ దృష్టితోనే అప్పట్లో పొత్తు పెట్టుకున్నామన్నారు. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టింది తానే అన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు.
అంతకుముందు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు తన వల్లే ఖమ్మం అభివృద్ధి చెందిందని అంటున్నారని.. కేసీఆర్ వల్లే తెలంగాణ అభివృద్ధి చెందిందని అన్నారు.
ఖమ్మం జిల్లాకు తెలంగాణకు చంద్రబాబు వల్లే మొదటి నష్టం అన్యాయం జరిగిందన్నారు. పోలవరానికి ఏడు మండలాలు గుంజుకున్నది చంద్రబాబు కాదా..? అని ప్రశ్నించారు.
'ఖమ్మంలో ఒక్క సాగు నీటి ప్రాజెక్ట్ కట్టా అని చంద్రబాబు నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాస్. కేసీఆర్ వల్లే ఖమ్మంకు జల వైభవం వచ్చింది. ఖమ్మంకు ఐటీ తెచ్చింది కేసీఆర్, కేటీఆర్‌లే. మేము కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్నాం. మమ్మల్ని బాబు ఆగం చేయొద్దు. ఎన్టీఆర్ పట్ల బాబు కన్నా కేసీఆర్‌కే ఎక్కువ ప్రేమ ఉంది. చంద్రబాబు హాయంలో ఖమ్మంకు బుడ్డ పైసా పని కాలేదు. ఖమ్మం కరకట్ట చంద్రబాబు పూర్తి చేసుంటే మొన్న భద్రాచలంలో వరదలు వచ్చేవా..? చంద్రబాబు సభ పెట్టిన గ్రౌండ్ చాలా చిన్నది. ఆంధ్రప్రదేశ్ నుంచి జనాలను తీసుకువచ్చారు..' అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
Also Read: MLAs Salary Statewise: రాష్ట్రాల వారీగా ఎమ్మెల్యే జీతాల వివరాలు.. తెలంగాణ, ఏపీకి తేడా ఎంతంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook