TS Weather Report: మహారాష్ట్రలోని పశ్చిమ విదర్బ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు తెలంగాణలో దక్షిణ, ఆగ్నేయ దిశల్నించి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని ఈ ప్రాంతాల్లో రానున్న మూడ్రోజులు వర్ష సూచన జారీ అయింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా తెలంగాణలో వాతావరణం చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే మూడ్రోజులు తెలంగాణలోని ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. జగిత్యా, సిరిసిల్ల, మహబూబాబాద్, అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల్, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక గ్రైటర్ హైదరాబాద్ పరిధిలో కూడా వర్షసూచన ఉంది. ఈ జిల్లాల్లో ఉదయం వేళ 38-43 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, కానీ సాయంత్రం సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడుతూ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఇవాళ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రేపు, ఎల్లుండి అక్కడక్కడా వర్షసూచన ఉంది. ఇవాళ, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ మోస్తరు వర్షాలు పడవచ్చు. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వర్షసూచన, మరికొన్ని జిల్లాల్లో బారీ ఉష్ణోగ్రతలు నమోదవుతూ భిన్న వాతావరణం కన్పిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో నిన్న 47 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదైంది.
Also read: Pithapuram: పిఠాపురంలో భారీగా 86 శాతం పోలింగ్, ఎవరికి అనుకూలం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook