Rain Alert: ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. మరోవైపు తీవ్రమైన వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న మూడు రోజులు వాతావరణంపై వాతావరణ శాఖ పూర్తి వివరాలు వెల్లడించింది. తెలంగాణలో ఎండల్నించి కాస్త ఉపశమనం కల్గించే వార్తను అందించింది.
తెలంగాణలో గత కొద్దిరోజులుగా ఎండల తీవ్రత పెరిగిపోయింది. సాధారణం కంటే 5-6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరోవైపు వేడిగాలులు ఆందోళన కల్గిస్తున్నాయి. పగటి పూట బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి కన్పిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, మరి కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. పెద్దపల్లి జిల్లా మంథని, జగిత్యాల జిల్లా నేరెళ్ల, సూర్యాపేట జిల్లా మునగాల, ఖమ్మం జిల్లా పమ్మిలో అత్యధికంగా 46.7 డిగ్రీలు నమోదైంది. ఇక నల్గొండ జిల్లా కామారెడ్డి గూడెం, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో 46.6 డిగ్రీలు రికార్డ్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 17 చోట్ల అత్యదికంగా 46 డిగ్రీలు దాటింది.
ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ నుంచి ఉపశమనం కల్గించే వార్త అందుతోంది. రానున్న 2-3 రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు పడవచ్చని ఐఎండీ వెల్లడించింది. మరాఠ్వాడా పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవహించి ఉందని తెలుస్తోంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకూ సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ద్రోణి ఇవాళ బలహీనపడింది. ఫలితంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook