Tigers and leopard seen in Tiger safari nagarKurnool: ఇటీవల కాలంలో అడవుల్లో పులుల, చిరుతల సంచారం ఎక్కువగా అయ్యిందని చెప్పుకొవచ్చు. అడవికి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో తరచుగా పులులు, చిరుతలు గ్రామాల్లోకి వచ్చేస్తున్నారు. కొన్నిసార్లు పెంపుడు జీవులపై, మనుషులపై సైతం దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల చిరుత పులుల దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలా ఉండగా.. నాగర్ కర్నూల్ జిల్లాలో 24 గంటల వ్యవధిలో 3 పులులు కన్పించాయి. అందులో.. 2 పెద్ద పులులు, ఒక చిరుత పులి ఉన్నాయి. టైగర్ సఫారీ వెళ్లిన టూరిస్ట్ లు పులుల్ని దగ్గరగా చూశారు. నల్లమల అభయారణ్యంలో, అమ్రాబాద్ వాచ్ టవర్ సమీపంలో పెద్దపులి కన్పించాయి.
పెద్దపులి ప్రత్యక్షంతో ఆనందం వ్యక్తం చేసిన సఫారీ టూర్ పర్యాటకులు.. తమ ఫోన్ పెద్దపులి కదలికల్ని వీడియో తీశారు. కాసేపు కనిపించి పెద్దపులి.. ఆ తర్వాత పొదలలోకి వెళ్లిపోయింది.. అభయారణల్లో పులుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుందని ఫారెస్ట్ సిబ్బంది వెల్లడించారు.
Read more: Madhu Priya: మళ్లీ వివాదంలో మధు ప్రియ.. ఏకంగా కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం గర్భగుడిలోనే..
ఇటీవల దోమల పెంట ఎస్.ఎల్.బి.సి పనుల దగ్గర గత రాత్రి చిరుత కన్పించింది. దీంతో గ్రామస్థులు రాత్రిపూట బైటకు వెళ్లేందుకు భయపడిపోతున్నారు. తమమీద ఎక్కడ దాడులు చేస్తాయో అని గ్రామస్థులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter