Privilege Motion Notice: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజన విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన టీఆర్ఎస్..ఏకంగా ప్రధాని నరేంద్రమోదీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది.
సరిగ్గే ఏడేళ్ల క్రితం జరిగిన రాష్ట్ర విభజన అంశం మళ్లీ వివాదాస్పదంగా మారుతోంది. 2014 ఫిబ్రవరిలో జరిగిన రాష్ట్ర విభజన అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల్ని టీఆర్ఎస్ తప్పుబట్టింది. కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తూ..ప్రధాని నరేంద్రమోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. ఏపీ రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించిన విషయంలో పార్లమెంట్, సభాపతిని అవమానపర్చేలా ప్రధాని మోదీ మాట్లాడారని..టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్, సురేశ్ రెడ్డి, లింగయ్య యాదవ్‌లు 187 నిబంధన ప్రకారం రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు సభా హక్కుల నోటీసు అందించారు.
TRS MPs move Privilege Motion against PM Narendra Modi for his statement in the Rajya Sabha on 8th February during the motion of Presidential Address on the passing of Andhra Pradesh Reorganisation Bill. pic.twitter.com/5s9dliGdUl
— ANI (@ANI) February 10, 2022
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధామిచ్చే ప్రక్రియలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ..నాడు అంటే 2014 ఫిబ్రవరిలో పార్లమెంటులో ఏపీ పునర్య్వవస్థీకరణ బిల్లున తొందరపడి ఆమోదించారని తప్పుబట్టారు. ఏ విధమైన చర్చ లేకుండా తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ వ్యతిరేకం కాదని..అయితే లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అశాస్త్రీయంగా చేశారని ప్రధాని మోదీ ఆరోపించారు. నాడు విభజన ప్రక్రియపై ఏ విధమైన సంప్రదింపులు జరగకుండా చేయడంతో..ఇప్పటికీ రెండువైపులా ఆందోళన కొనసాగుతోందనేది ప్రధాని మోదీ వ్యాఖ్యల సారాంశం.
ఈ వ్యాఖ్యల్ని టీఆర్ఎస్ (TRS) నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. నాటి తెలంగాణ ఉద్యమాన్ని అవమానించేలా మోదీ వ్యాఖ్యలున్నాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ , టీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టడమే కాకుండా ప్రధాని మోదీ దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ వర్గాలు ఆందోళన చేపట్టాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాలుగా పోరాడిన రాష్ట్ర ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన ప్రకటిస్తూ..నల్లబ్యాడ్జీలు ధరించారు. మోటార్ సైకిల్ ర్యాలీలు తీశారు. ప్రదర్శనలతో నల్ల బెలూన్స్ గాలిలోకి వదిలారు. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య ప్రతి అంశంపై ఘర్షణ రేగుతోంది. ఇప్పుడు తాజాగా రాష్ట్ర విభజనను ప్రధాని మోదీ (PM Narendra Modi)తప్బుబట్టడంతో..టీఆర్ఎస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు అందించాయి.
Also read: Medaram Jatara Buses: ఆర్టీసీ బంపర్ ఆఫర్, రూ.50 టికెట్‌తో మూడు నగరాల్లో 24 గంటలు తిరగొచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook