Teenmar Mallanna Arrest: జర్నలిస్ట్, క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. వరంగల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపేందుకు తీన్మార్ మల్లన్న హనుమకొండ జిల్లా ఆరెపల్లికి వెళ్లారు. అక్కడి రైతులు చేపట్టిన ఆందోళనలో మల్లన్న పాల్గొనడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. అరెస్ట్ అనంతరం మల్లన్నను వేలేరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అంతకుముందు, ఆరేపల్లి పోచమ్మ ఆలయం వద్ద మల్లన్న రైతులతో మాట్లాడారు. రైతులకు అండగా నిలబడేందుకే తాను ఆరేపల్లి వచ్చినట్లు తెలిపారు. గతంలోనూ ఇక్కడి రైతులకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో జనగామ వద్ద తనను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం చేసేది గొప్ప పనులే అయితే తనలాంటి వాళ్లను అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. రైతుల ఇండ్ల మీద ప్రభుత్వ పెత్తనమేంటని ప్రశ్నించారు.
వందల ఎకరాలున్న ప్రజాప్రతినిధుల భూములు దానం చేయరు కానీ... పేదోళ్ల భూములు లాక్కోవడమేంటని ప్రశ్నించారు. ముందు ప్రజాప్రతినిధులు భూములు ఇచ్చేందుకు ముందుకొస్తే... ఆ తర్వాత రైతులు కూడా భూములు ఇస్తారని అన్నారు. రైతుల భూములు లాక్కుంటే వాళ్ల బతికేదెలా అని ప్రశ్నించారు. పోరాడకపోతే భవిష్యత్తు అగమ్యగోచరమేనని... ల్యాండ్ పూలింగ్ జీవో 80ని రద్దు చేసేంతవరకూ రైతుల పక్షాన తీన్మార్ మల్లన్న పోరాడుతాడని స్పష్టం చేశారు. రైతులంతా ఐక్యతగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని... లేదంటే ప్రభుత్వం దెబ్బకొడుతుందని అన్నారు. దొడ్డిదారిన తెచ్చిన జీవో 80ని రద్దు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.
Also Read: Anti Aging Tips: ఈ 5 చిట్కాలు పాటిస్తే మీ ముఖంపై ముడతలు మాయం
Also Read: Viral News: అరుదైన కేసు... భార్యతో 10ని. శృంగారం తర్వాత 'గజిని'లా మారిన వ్యక్తి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook