Presidential Elections: దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. తెలంగాణలోనూ ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే ఎమ్మెల్యే సీతక్క తమపార్టీ బలపరిచిన అభ్యర్థికి కాకుండా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేశారు. ఓటు వేశాక పొరపాటును గ్రహించిన సీతక్క..మరొక బ్యాలెట్ పత్రం ఇవ్వాలంటూ ఎన్నికల అధికారిని కోరారు. దానికి అధికారులు నిరాకరించారు
Presidential Elections 2022: కాంగ్రెస్పార్టీ ములుగు ఎమ్మెల్యే సీతక్క రాంగ్ ఓటు వేశారు. రాష్ట్రపతి ఎన్నికలో భాగంగా తమ పార్టీ బలపరిచిన అభ్యర్థికి కాకుండా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్మూకు ఓటు వేశారు. అయితే, ఓటు వేసిన తర్వాత పొరపాటును గ్రహించిన సీతక్క.. మరో బ్యాలట్ పత్రం ఇవ్వాలంటూ ఎన్నికల అధికారులను కోరారు. అయితే, ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు బదులిచ్చారు. అయితే, సీతక్క మాట్లాడుతూ తన ఆత్మసాక్షి ప్రకారం ఓటేశానని చెప్పారు