Afghanistan Blast: అఫ్గానిస్థాన్ లో వరుస పేలుళ్లు.. 18 మంది మృతి, పలువురికి గాయాలు!

Afghanistan Blast: తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అఫ్గానిస్థాన్ లో హింస తాండవిస్తోంది. ఇప్పటికే అనేక సార్లు బాంబు దాడులు జరిగిన నేపథ్యంలో తాజాగా 4 వరుస పేలుళ్లలో దాదాపుగా 18 మంది మరణించారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2022, 04:17 PM IST
Afghanistan Blast: అఫ్గానిస్థాన్ లో వరుస పేలుళ్లు.. 18 మంది మృతి, పలువురికి గాయాలు!

Afghanistan Blast: అఫ్గానిస్తాన్ లో మరోసారి భారీ పేలుడు సంభవించింది. తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశంలో హింస పెరిగిపోయింది. వరుస దాడులు, పేలుళ్లతో ఆ దేశం అట్టుడుకుతుంది. తాజాగా ఆ దేశంలోని మజార్ - ఏ - షరీఫ్ మసీద్ లో పేలుడు సంభవించినట్లు అంతర్జాతీయ వార్తాసంస్థలు పేర్కొన్నాయి. 

అయితే మజార్ - ఏ - షరీఫ్ మసీదులో వరుసగా 4 పేలుళ్లు జరిగినట్లు ఆ నివేదికల్లో ఉంది. ఈ ప్రమాదంలో దాదాపుగా 18 మంది మరణించడంతో పాటు పలువురు గాయాలైనట్లు తెలుస్తోంది. 

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి చేర్చి చికిత్సను అందిస్తున్నారు. అయితే ఈ పేలుళ్ల వెనుక కారణాలు ఎవ్వరికి తెలిసి రాలేదు. దీంతో పాటు కాబూల్, నంగర్హర్, కుందుజ్ లలో కూడా భారీ పేలుడు జరిగినట్లు వార్తలు వచ్చాయి.  

Also Read: Planet Parade 2022: ఆకాశంలో అద్భుతం...ఒకే రేఖపైకి ఐదు గ్రహాలు..!!

Also Read: India Covid Cases: మరోసారి పెరిగిన కరోనా కేసులు.. ఫోర్త్ వేవ్ కు సంకేతమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News