China Puts City On Lockdown: కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంలోని పలు నగరాల్లో కరోనా కేసులు (Covid Cases In China) పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. దేశీయంగా కరోనా వైరస్ స్పైక్‌ను (Covid Spike In China) అరికట్టేందుకు దాదాపు 40 లక్షల జనాభా ఉన్న లాన్జౌ నగరంలో లాక్డౌన్ విధించింది. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించింది.
చైనాలోని వాయువ్య ప్రావిన్సు గన్సు రాజధాని అయిన లాన్‌జౌలో (Lanzhou On Lockdown) తాజాగా ఆరు కేసులు నమోదవ్వగా.. చైనా వ్యాప్తంగా సోమవారం 29 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో భాగంగా విమానాలను రద్దు చేయడం, కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించడం వంటి చర్యలకు ఉపక్రమిస్తోంది. అవసరమైన ప్రాంతాల్లో లాక్డౌన్లు కూడా విధిస్తోంది స్థానిక యంత్రాంగం.
ఇతర దేశాలతో పోలిస్తే.. కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న చైనా.. ఇప్పుడు మళ్లీ లాక్డౌన్లు విధించడం, సరిహద్దులు మూసేయడం వంటి చర్యలు తీసుకుంటోంది. చైనాలో కొత్తగా 29 కరోనా కేసులు (Covid Cases In China) వెలుగు చూశాయి. ఇతర దేశాలతో పోల్చి చూస్తే ఈ సంఖ్య చాలా చిన్నగా అనిపించినా.. చైనాలో మాత్రం ఇది చాలా ఎక్కువ. స్పష్టంగా చెప్పాలంటే.. ప్రపంచంలో మొదటి సారిగా చైనాలోనే కరోనా కేసులు వెలుగు చూశాయి. అయినా ఇప్పటి వరకు ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య లక్ష కూడా దాటలేదు. అంటే.. రోజువారీ కేసుల సంఖ్య ఎంత తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వృద్ధ జంట కారణంగా పెరుగుతున్న కేసులు?
పలువురు టూరిస్టులతో కలిసి చైనాలో పర్యటిస్తున్న ఓ వృద్ధ జంటకు కరోనా సోకినట్లు గుర్తించలేకపోవడమే కేసులు పెరిగేందుకు కారణమని స్థానిక అధికారులు భావిస్తున్నారు. షాంఘై నుంచి వచ్చిన ఈ వృద్ధ దంపతులు గ్జియాన్, గన్సూ, బీజింగ్ సహా ఐదు ప్రావిన్సుల్లో పర్యటించినట్లు గుర్తించారు. వాయువ్య చైనాలో కొవిడ్ ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలిసింది. వారు పర్యటించిన ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. బీజింగ్ సహా పలు నగరాలకు వచ్చి వెళ్లాల్సిన వందాలది విమానాలను రద్దు చేశారు.
దేశంలో తలెత్తిన బొగ్గు సంక్షోభం నేపథ్యంలో మంగోళియా నుంచి చేసుకుంటున్న దిగుమతుల కారణంగా కూడా.. పలు ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నట్లు చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో.. టెస్టుల సంఖ్యను భారీగా పెంచింది చైనా. కరోనా సోకినవారిని క్వారంటైన్లో ఉంచి.. చికిత్స అందిస్తోంది.
Also Read: Corona in China: చైనాలో మళ్లీ కరోనా భయాలు.. స్కూళ్లకు సెలవులు, వందలాది విమానాలు రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook