అఫ్ఘానిస్థాన్ (Afganista) ను ఆక్రమించి ఆటవిక పాలనకు సిద్దం అవుతున్న తాలిబన్లపై (Taliban) ప్రపంచ దేశాలు వ్యతిరేఖ అభిప్రాయాలను వ్యక్త పరుస్తుంటే చైనా (China)మాత్రం తాలిబన్లతో చెలిమికి తహతహలాడుతోంది.
ఇటీవలే చైనాలో పర్యటించిన అఫ్ఘాన్ తాలిబన్లు (Afghan Talibans) ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Wang Yi) ని కలిసి.. ఎట్టి పరిస్థితుల్లోను చైనా-అఫ్ఘాన్ (China-Afghanistan Boarders) సరిహద్దులు పంచుకుంటున్న భూభాగంలో ఎలాంటి ఉగ్రవాద చర్యలను చేయమని భరోసా ఇచ్చిన తరువాతే తాలిబన్లతో తమ స్నేహానికి అంగీకరిస్తామని తెలిపింది. ఈ ఒప్పొందానికి తాలిబన్లు సరే అనటంతో అఫ్ఘానిస్థాన్ పునఃనిర్మాణనికి మరియు ఆర్ధికపరంగా సహాయం చేస్తామని చైనా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
Also Read: Ram Charan: జాతీయ జెండాను అవమానించారంటూ చెర్రీపై ట్రోల్స్? అసలు ఏం జరిగింది?
VIDEO: 🇨🇳🇦🇫 China is ready to deepen "friendly and cooperative" relations with #Afghanistan, a government spokeswoman says, after the Taliban seized control of the country pic.twitter.com/PmaDcyTL7Z
— AFP News Agency (@AFP) August 16, 2021
"తాలిబన్ల ప్రభుత్వాన్ని ఎవరు గుర్తించవద్దని" బ్రిటన్ ప్రధాని అభిలాశించాగా.. ప్రజస్వామ్య దేశాలన్నీ బ్రిటన్ ప్రధానితో (Britain President) ఏకీభావిస్తున్నాయి. అక్కడ జరిగే పరిస్థితులను అనుకూలంగా మార్చుకోటానికి చైనా, అఫ్ఘాన్ ప్రభుత్వంతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరుచుకునేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపింది.
"అఫ్ఘాన్ ప్రజల తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకోవాలన్న ఆలోచనలను చైనా (Chaina) స్వాగతిస్తుందని, ఆ దేశంతో మేము స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నాం" అని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి "హూ చున్‌యింగ్" (Hua Chunying) తాజాగా వ్యాఖ్యానించారు.
ఒకవైపు అఫ్ఘాన్ లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటు, ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలు కలవార పెడుతున్నాయని రష్యా (Russia) వ్యాఖ్యానించింది. ఉహించిన దాని కంటే వేగంగా అఫ్ఘాన్ రాజధాని కాబుల్ ఆక్రమణ, తాలిబన్ల దూకుడు వ్యవహారానికి అగ్ర రాజ్యం అమెరికా (America) సైతం ఆశ్చర్యానికి గురవుతుంది. అంతేకాకుండా, ఉగ్రవాదులకు చైనా పరోక్షంగా తన పద్ధతు ప్రకటించిందని ప్రపంచ దేశాలు అభిప్రాయ పడుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook