DNA Reproduction: సృష్టి ధర్మానికే చైనా శాస్త్రవేత్తలు కొత్త నిర్వచనం చెబుతున్నారు. పునః సృష్టికి కొత్త విధానం తీసుకొచ్చారు. సాధారణంగా జంతుజీవ రాశుల్లో కలయికతోనే ఇతర జీవి జన్మించడం అనేది ఉంటుంది. ఇకపై కలయిక లేకుండానే పునరుత్పత్తి సాధ్యమవుతుంది. ఆ విధంగా కొత్త పరిశోధన చేపట్టి విజయవంతంగా కలయిక లేకుండానే ఓ జీవికి జన్మనిచ్చారు చైనా శాస్త్రవేత్తలు. మానవుడి పరిశోధనల్లో ఇదే అత్యున్నత పరిశోధనగా పరిగణిస్తున్నారు. ఆ పరిశోధన ఏమిటి? భవిష్యత్తులో మానవులు కూడా ఆ విధంగా జన్మిస్తారా? అనే ఆలోచనలు రేకెత్తుతున్నాయి. ఆ పరిశోధన వివరాలు ఇలా ఉన్నాయి.
చైనా శాస్త్రవేత్తలు ఒక కొత్త పరిశోధనను నిర్వహించారు. ఇది ఆడవారి ద్వారా కాకుండా మగ ద్వారా మాత్రమే పునరుత్పత్తి కలుగుతుంది. మగజీవినే జన్మనిస్తుందని చైనాలో చేసిన ఓ పరిశోధన నివేదిక తెలిపింది. ఈ పరిశోధనలో మహిళ అవసరం లేకుండానే పురుషుడు మాత్రమే పునరుత్పత్తి చేయగలడు. జంతువు సంతానం సృష్టించడానికి ఆడ లేకుండా రెండు మగ ఎలుకల డీఎన్ఏను ఉపయోగించగలడు. సాంకేతికతను వినియోగించి వాళ్లు ఆడ జంతువు లేకుండా మగ జంతువుతోనే సంతానం కలిగించాడు.
Also Read: Maha Kumbh Mela: మహా కుంభమేళాలో అత్యాద్భుతం.. 154 ఏళ్ల మనిషి ప్రత్యక్షం వాస్తవమిదే!
సాంకేతికత ద్వారా ఆడ డీఎన్ఏ సహాయం లేకుండా కేవలం రెండు మగ ఎలుకల డీఎన్ఏతో ఒక ఎలుకను సృష్టించవచ్చు. జన్యుశాస్త్రంలో చైనా శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నారు. రెండు మగ ఎలుకల సహాయంతో ఒక ఎలుకకు జన్మనిచ్చారు. మగ జీవి ద్వారా కలిగిన ఎలుకలు యుక్తవయస్సు వరకు జీవించి ఉంటాయని ఈ నివేదిక వెల్లడిస్తోంది. జనవరి 8వ తేదీన చైనాలో ఓ అధ్యయనం ప్రచురితమైంది . చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన చేసింది. పునరుత్పత్తికి డీఎన్ఏ ఎలా ఉపయోగపడుతుందని పరిశోధన చేశారు. అనేక పరిశోధనలు.. ప్రయోగాలు చేసి చివరకు విజయవంతమయ్యారు.
డీఎన్ఏ పునరుత్పత్తికి ఎలా ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఈ పరిశోధన చేశారు. డీఎన్ఏ సరిగ్గా పనిచేస్తే పునరుత్పత్తికి కారణమవుతుందని పరిశోధించారు . ఇంతకుముందు జపాన్ శాస్త్రవేత్తలు మగ ఎలుకల చర్మాన్ని ఉపయోగించి గుడ్లు, స్పెర్మ్లతో ఫలదీకరణం చేసి మగ డీఎన్ఏతో ఎలుకలను సృష్టించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధన ప్రకారం డీఎన్ఏ ద్వారా రెండు మగ ఎలుకలను సృష్టించారని సమాచారం. అయితే చైనాలో చేసిన ఈ పరిశోధనపై ఎలాంటి అధికారిక ఆధారం లేదు. కానీ ఈ పరిశోధన జరిగిందనే వార్త వైద్యరంగంలో చర్చనీయాంశమైంది. చైనా జరిగే ప్రపంచానికి చాలా కష్టం. ఈ క్రమంలోనే ఈ పరిశోధనపై అధికారికంగా చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.