COVID-19 vaccinations: జెనెవా / జ్యూరిచ్: కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచం మొత్తాన్ని పట్టిపీడిస్తోంది. రోజురోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు వ్యాక్సిన్ ( covid-19 vaccine ) అభివృద్ధి కాలేదు. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్‌ఓ ఒక కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు డబ్లూహెచ్ఓ ( WHO ) అత్యవసర కార్యక్రమాల విభాగాధిపతి (WHO`s emergencies programme) మైఖేల్ జె. ర్యాన్ ( Michael J. Ryan ) సోషల్‌మీడియా ద్వారా బుధవారం మాట్లాడుతూ.. వచ్చే 2021 ప్రారంభం వరకు వ్యాక్సిన్‌ను ఆశించవద్దని సూచించారు. అందరికీ వ్యాక్సిన్ కోసం WHO పనిచేస్తోందని ర్యాన్ పేర్కొన్నారు. Also read: Covid19 Vaccine: ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పేరేంటో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయని, ఈ సమయంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడం ప్రధాన లక్ష్యం కావాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ల అభివృద్ధిలో మంచి పురోగతి సాధిస్తున్నామని.. చాలా టీకాలు ఇప్పుడు 3 వ దశ ట్రయల్స్‌లో ఉన్నాయని ర్యాన్ తెలిపారు. ఏ ఒక్క టీకా కూడా విఫలం కాలేదని.. భద్రత, రోగనిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేసే సామర్థ్యం పరంగా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా.. ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి సాధించాల్సి ఉందన్నారు. Also read: Oxford Vaccine: ఆ వ్యాక్సిన్ లో సగం భారత్ కే
అయితే.. కరోనావైరస్ సమాజ వ్యాప్తి అదుపులోకి వచ్చే వరకు పాఠశాలల పున:ప్రారంభంపై జాగ్రత్తగా ఉండాలని ర్యాన్ హెచ్చరించారు. పిల్లలను పాఠశాలలకు పంపించడం కంటే.. మన సమాజంలో వ్యాధిని ఆపడం ముఖ్యమని ఆయన సూచించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టిన తర్వాత పాఠశాలలు ప్రారంభిస్తే మంచిదని ర్యాన్ అభిప్రాయపడ్డారు. Also read: Brave Girl: ఉగ్రవాదులను తుదముట్టించిన సాహస బాలిక