Aid to Afghan: ఆఫ్ఘనిస్తాన్‌కు భారీగా ఆర్ధిక సహాయం అందించనున్న ప్రపంచ దేశాలు

Aid to Afghan: తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్ఘనిస్తాన్‌కు భారీగా సహాయం అందనుంది. ఆఫ్ఘన్ ప్రజల్ని ఆదుకునేందుకు పెద్దఎత్తున ఆర్ధిక సహాయం అందిస్తామని ప్రపంచ దేశాలు ప్రకటించాయి. ప్రపంచ దేశాల హామీపై ఐక్యరాజ్యసమితి వివరాలు వెల్లడించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 15, 2021, 10:21 AM IST
  • ఆఫ్ఘనిస్తాన్ కు భారీగా అందనున్న ఆర్ఖిక సహాయం
  • ఐక్యరాజ్యసమితి పిలుపుకు పెద్దఎత్తున స్పందించిన అంతర్జాతీయ సమాజం
  • ప్రపంచదేశాల్నించి 8 వేల 836 కోట్ల రూపాయల మేర ఆర్ధిక సాయం
Aid to Afghan: ఆఫ్ఘనిస్తాన్‌కు భారీగా ఆర్ధిక సహాయం అందించనున్న ప్రపంచ దేశాలు

Aid to Afghan: తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్ఘనిస్తాన్‌కు భారీగా సహాయం అందనుంది. ఆఫ్ఘన్ ప్రజల్ని ఆదుకునేందుకు పెద్దఎత్తున ఆర్ధిక సహాయం అందిస్తామని ప్రపంచ దేశాలు ప్రకటించాయి. ప్రపంచ దేశాల హామీపై ఐక్యరాజ్యసమితి వివరాలు వెల్లడించింది.

ఆఫ్ఘనిస్తాన్‌లో(Afghanistan) ప్రభుత్వం మారినా పరిస్థితులు మాత్రం ఘోరంగా ఉన్నాయి. తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం నెలకొంది దేశంలో. మరోవైపు కరవు, పేదరికం, వలసలో ఆఫ్ఘన్ ప్రజలకు సతమతమవుతున్నారు. ఆఫ్ఘన్ ప్రజల్లో ఆకలి, వసతుల లేమి తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో ఆఫ్ఘన్ ప్రజల్ని ఆదుకునేందుకు ప్రపంచదేశాలు ముందుకొచ్చాయని ఐక్యరాజ్యసమితి(UNO) ప్రదాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ వెల్లడించారు.

ప్రపంచ దేశాలన్నీ కలిపి ఆఫ్ఘనిస్తాన్‌కు 8 వేల 836 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం (International Aid to Afghan)అందించేందుకు సిద్ధమయ్యాయి. ఉగ్రవాదం పెరగకుండా, మానవ హక్కుల పరిరక్షణ వంటి సమస్యలపై ప్రపంచదేశాలు కృషి చేయాలని గుటెర్రస్ సూచించారు. సమస్యల వలయంలో చిక్కుకున్న ఆప్ఘనిస్తాన్‌కు సత్వర ఆర్ధిక సహాయం అందించాలని జెనీవాలో విరాళాల సేకరణ చేపట్టారు. ఆఫ్ఘన్ అవసరాల కోసం 60.6 కోట్ల డాలర్ల సహాయం అవసరమని ఐక్యరాజ్యసమితి కోరింది. ఈ పిలుపుకు అంతర్జాతీయ సమాజం నుంచి అధ్భుతమైన స్పందన లభించింది. ఏకంగా 1.2 బిలియన్ డాలర్లు సహాయం చేసేందుకు దేశాలు ముందుకొచ్చాయి. అదే సమయంలో తాలిబన్ల అనుమతి లేకుండా మానవతా కార్యక్రమాలు అమలు అసాధ్యమని గుటెర్రస్ తెలిపారు. మానవ హక్కులు, మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదం సమస్యలకు సంబంధించి ప్రజలకు సహాయం అందించాలంటే తాలిబన్ ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగించాల్సిందేనన్నారు. మొన్నటి వరకూ కాబూల్ ఎయిర్‌పోర్ట్(Kabul Airport) వద్ద వేలాది ఆఫ్ఘన్ అభాగ్యుల పడిగాపులు, బాంబు పేలుళ్లు వంటి విషాద ఘటనల నేపధ్యంలో ఐక్యరాజ్యసమితి(UNO) సహాయ కార్యక్రమాల్ని కొనసాగించాల్సిన అవసరముందన్నారు. 

Also read: America Green Card: అమెరికా గ్రీన్‌కార్డు ఇకపై సులభమే..సూపర్ ఫీ చెల్లిస్తే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News