రోమ్: కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారితో అధికంగా పోరాడుతున్న దేశాలలో ఇటలీ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే కోవిడ్19 బారిన పడి ఇటలీలో 7500 మంది చనిపోగా, మరో 70వేల మందికి పాజిటీవ్‌గా తేలింది. చైనాలో మొదలైన ఈ కరోనా ఇటలీని మాత్రం ముప్పుతిప్పలు పెడుతోంది. అయితే ఇటలీకి ఈ ఉపద్రవం ముంచుకురావడానికి ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ కారణమంటే మీరు నమ్ముతారా. కానీ నమ్మక తప్పదు. ఆ వివరాలిలా ఉన్నాయి. కరోనా వదంతులపై ఈ 6 నిజాలు తెలుసుకోండి
ఇటలీలో తొలి కరోనా పాజిటీవ్ కేసు ఫిబ్రవరి 21న నమోదైంది. దీనికి రెండు రోజుల ముందు ఫిబ్రవరి 19న అట్లాంట, స్పెయిన్ క్లబ్ వాలెన్సియా జట్ల మధ్య సాన్ సిరో స్టేడియంలో ఫుట్ బాట్ మ్యాచ్ జరిగింది. దేశంలో పలు ప్రాంతాల నుంచి ఫుట్ బాల్ ప్రేమికులు మ్యాచ్‌కు హాజరయ్యారు. మ్యాచ్ జరిగిన కొన్ని రోజుల తర్వాత వాలెన్సియా జట్టులోని 35శాతం మంది ఆటగాళ్లకు కోవిడ్19 పాజిటీవ్‌గా తేలింది. ఈ మ్యాచ్‌కు హాజరైన వారిలో చాలా మందికి కోవిడ్ వైరస్ సోకింది. అయితే వీరికి ప్రాణాంతక వైరస్ సోకిన విషయం తెలియదు. వీరి నుంచి మరికొంత మందికి, అలా వేల మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు భావిస్తున్నారు. బాబాయ్ Pawan Kalyan స్ఫూర్తితో రామ్ చరణ్ విరాళం
దేశంలో కరోనా మరణాలు అధికమైన తరుణంలో ఆ ఫుట్ బాల్ మ్యాచ్‌ను గేమ్ జీరోగా అభివర్ణిస్తున్నారంటే దీని ప్రభావం ఇటలీలో కరోనా మరణాలపై ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మ్యాచ్ తర్వాత దాదాపు 40వేల మంది ఇతరులను కౌగిలించుకోవడం, ముద్దులు ఇచ్చుకున్నారని.. దీంతో కరోనా వైరస్ సులువుగా ఇతరులకు పాకిందట. మ్యాచ్ జరిగిన ప్రాంతంలో 1000 కరోనా మరణాలు సంభవించడం మ్యాచ్ వల్లే అనే వాదనకు ఊతమిస్తుంది. ఇటలీలో ఆగని కరోనా మృత్యుఘోష
దీనిపై పోప్ జాన్ 23 ఆసుపత్రి ఐసీయూ విభాగం అధిపతి డాక్టర్ లుకా లోరిణి సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మ్యాచ్‌కు హాజరైన వారిలో చాలా మందికి కరోనా సోకి ఉంటుందని స్థానిక మీడియా ద అసోసియేటెడ్ ప్రెస్‌కు వెల్లడించారు. చిన్న చిన్న తప్పిదాల కారణంగా ఇటలీ ప్రజలు యుద్ధం చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కడుపుబ్బా నవ్వించే కరోనా మీమ్స్
ఈ కారణాలతోనే బీసీసీఐ ట్వంటీ20 టోర్నీ ఐపీఎల్ నిర్వహణను వాయిదా వేసింది. విదేశీయులను దేశంలోకి అనుమతిని నిలిపివేస్తూ వీసాలను తాత్కాలికంగా రద్దు చేసింది. తాజాగా 21 రోజులపాటు భారత్‌లో లాక్డౌన్ కొనసాగుతోంది. ఐపీఎల్ 2020 నిర్వహించకపోవడమే ఉత్తమమని, ఆటల కంటే మన ప్రాణాలే ముఖ్యమన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. కొందరు మాత్రం వైరస్ సమస్య నుంచి త్వరలోనే బయట పడతామని.. ట్వంటీ20 లీగ్‌ను ఆస్వాదిస్తామని ధీమాగా ఉన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..