Miami plane crash landed: ఎయిర్ పోర్టులో కూలిపోయిన విమానం.. మంటల్లో దగ్ధం

Miami plane crash landed: ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుండగా విమానం రన్‌వేపై కూలిపోయిన ఘటన అమెరికాలోని మియామిలో చోటుచేసుకుంది. రెడ్ ఎయిర్‌వేస్‌కి చెందిన విమానం మియామి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుండగా ల్యాండింగ్ గేర్ చెడిపోయింది.

Last Updated : Jun 22, 2022, 09:46 PM IST
  • మియామి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కూలిన విమానం
  • ప్రమాదం సమయంలో విమానంలో 126 మంది
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Miami plane crash landed: ఎయిర్ పోర్టులో కూలిపోయిన విమానం.. మంటల్లో దగ్ధం

Miami plane crash landed Video: ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుండగా విమానం రన్‌వేపై కూలిపోయిన ఘటన అమెరికాలోని మియామిలో చోటుచేసుకుంది. రెడ్ ఎయిర్‌వేస్‌కి చెందిన విమానం మియామి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుండగా ల్యాండింగ్ గేర్ చెడిపోయింది. దీంతో విమానం అదుపుతప్పి రన్‌వేపైనే కూలిపోయిపోయింది. రన్‌వేపై అదుపుతప్పిన విమానం చాలాదూరం వెళ్లి రన్ వే పక్కనే ఉన్న గడ్డినేలపై ఆగిపోయింది. ఈ ఘటనలో విమానం మంటల్లో చిక్కుకున్నప్పటికీ.. అదృష్టవశాత్తుగా ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కూలిపోయిన విమానంలో మొత్తం 126 మంది ఉండగా.. వారిలో ముగ్గురికి గాయాలయ్యాయి. 

ఈ విమానాన్ని డొమినికన్ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగో నుంచి మియామి ఎయిర్ పోర్టుకు వచ్చిన విమానంగా అధికారులు గుర్తించారు. విమానం ప్రమాదానికి గురైన మరుక్షణమే అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది హుటాహుటిన ప్రయాణికులను అందులోంచి ఖాళీ చేయించి వారిని సురక్షితంగా ప్రయాణికుల ప్రాంగణానికి తరలించారు. ఎయిర్ పోర్టులోని అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Also read : Washington DC Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. వాషింగ్టన్ కాల్పుల్లో మైనర్ మృతి, ముగ్గురికి గాయాలు

Also read : Video: సైకిల్ తొక్కుతూ కింద పడిపోయిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News