Fisherman Shot in North Korea | ఉత్తర కొరియా గురించి అక్కడి నియంత కిమ్ జాంగ్ ఉన్ పాలన గురించి మీరు వినే ఉంటారు. చిన్న చిన్న కారణాల వల్ల అక్కడ మనుషుల ప్రాణాలు తీసే సైనికుల గురించి వినే ఉంటారు. ఇది కూడా అలాంటి ఘటనే. విదేశీ రేడియో వింటున్నాడు అనే కారణంతో ఒక మత్స్యకారుడిని కాల్చి చంపింది ఉత్తర కొరియా.
Also Read | సూపర్ ఫీచర్స్ తో Toyota Innova Crysta ను లాంచ్ చేసిన Totoya, ధర ఇతర వివరాలు తెలుసుకోండి.
మత్స్యకారులకు చెందిన ఒక బోటు కెప్టెన్ సుమారు 15 సంవత్సరాల నుంచి విదేశీ కార్యక్రమాలను రేడియోలో వింటున్నాడట. ఈ విషయం గురించి తెలిసిన తరువాత అతన్ని అతని 100 మంది టీమ్ ముందు. సాటి మత్స్యకారుల ముందు కాల్చి చంపారు సైనికులు.
ఉత్తర కొరియాలో (North Korea) మీడియాపై ఆంక్షలు ఉన్నాయి. ప్రభుత్వ టీవీ ఛానెల్స్ రేడియో, పేపర్స్ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా ఈ నియమాలు ఉల్లంఘిస్తే వారి మాట కూడా వినకుండా షూట్ చేస్తుంటాడు.
40 సంవత్సరాల ఒక మత్స్యకారుడు చోంగ్జిన్ ఇతర దేశానికి చెందిన రేడియో వినడాన్ని ఫ్రీక్వెన్సీ ద్వారా తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఫైర్ స్వ్కాడ్ అతన్ని 100 మంది ముందు కాల్చిచంపింది.
Also Read | FasTag Mandatory: ఫాస్టాగ్ ఇక తప్పనిసరి, ఎప్పటి నుంచో తెలుసా ?
మరణానికి ముందు అతను సుమారు 50 నౌకా ప్రయాణాలు పూర్తి చేశాడని సమాచారం. రేడియో ఫ్రీ ఏషియా అనే రేడియో స్టేషన్ వింటున్నాడు. మిలటరీలో ఉన్న సమయం నుంచి అతను రేడియో వింటున్నాడు అని సమాచారం. అతని మరణానికి కారణం తెలిపుతూ చోంగ్జిన్ దురుసు ప్రవర్తన వల్లే ఇలా చేశాం అని వివరణ ఇచ్చుకుంది నార్త్ కోరియా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe