Pakistan Woman harassed by an unidentified man in Islamabad: మహిళల భద్రత విషయంలో ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ప్రపంచంలో ఏదో మూల వారి మీద వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారిని కూడా కామాంధులు వదలడం లేదు. అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలు రోజూ వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌లో ఓ దారుణం వెలుగుచూసింది. ఇస్లామాబాద్‌లో బురఖా ధరించిన మహిళపై ఓ ఆకతాయి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఇస్లామాబాద్‌లోని సెక్టార్ I-10 వీధిలో బురఖా వేసుకున్న ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్ వేసుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమెను వెంబడించాడు. కొద్ది దూరం వచ్చాక మహిళ వెనకాల నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన ఆకతాయి.. ఆమెను పట్టుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మహిళ ఆ వ్యక్తిని పక్కకు తోయగానే.. అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన మొత్తం అక్కడి ఉన్న ఓ ఇంటి కెమెరాలో రికార్డ్ అయ్యింది. జియో టీవీ ప్రకారం.. ఈ సంఘటన పగటిపూటనే జరిగిందట. ఈ సీసీటీవీ ఫుటేజీ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
సీనియర్ జర్నలిస్ట్ హమీద్ మీర్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఓ ట్వీట్‌ను షేర్ చేశారు. ఈ సంఘటనలోని దోషిని గుర్తించి, శిక్షించి, ఇతరులకు గుణపాఠం చెప్పాలని హమీద్ పేర్కొన్నారు. పురుషులందరికీ ఇది ఓ సవాలు అని అన్నారు. ఇదివరకు పాకిస్తాన్‌లోని మెట్రో స్టేషన్ వెలుపల పలువురు పురుషులు టర్కీ మహిళను వేధించడం, దాడి చేయడంకు సంబందించిన వీడియో వైరల్‌గా మారింది. గతేడాది పాకిస్థాన్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వీడియో తీస్తున్న సమయంలో లాహోర్‌లో వందలాది మంది తనపై దాడి చేశారని ఓ టిక్‌టోకర్ ఆరోపించారు.
سیکٹر آئی 10 میں حوس کے پجاری درندہ صفت شخص کی حرکت دیکھیں جن محترمہ کےساتھہ یہ واقع ہواہے انھوں نے یہ ویڈیو مجھے سینڈ کی ہے پولیس کی طرف سےفی الحال کوئی کاروائی نہیں کی گئی افسوس@ICT_Police @javerias @HamidMirPAK @arsched @Wabbasi007 @PalwashaAbbasi0 @Islaamabad @waqasabbasi85 pic.twitter.com/HFFE5Aesey
— Ehtesham Ali Abbasi⚔ (@ehtashamabbasi) July 17, 2022
పాకిస్థాన్‌లో 70 శాతం మంది మహిళలు పని చేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. 2004-2016 మధ్య 4,734 మంది మహిళలు లైంగిక హింసను ఎదుర్కొన్నారని మహిళల హక్కుల కోసం పనిచేస్తున్న వైట్ రిబ్బన్ అనే పాకిస్తాన్ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. పాక్ ప్రభుత్వం పని స్థలంలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా రక్షణ (సవరణ బిల్లు) 2022ను ఆమోదించింది. అయినా వేధింపులు మాత్రం ఆగడం లేదు.
Also Read: Nupur Sharma Arrest: నుపుర్ శర్మకు ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం!
Also Read: Rahul-Athiya Marriage: కేఎల్ రాహుల్-అతియా శెట్టిల వివాహం జరగదు.. అసలు కారణం ఇదే!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook