Miss World AMerica 2021: మిస్ వరల్డ్ అమెరికా 2021ని గెలుచుకున్న తొలి భారత సంతతి అమెరికన్‌గా శ్రీ షైనీ(Shree Sain) నిలిచింది. ఈ అమ్మాయి వాషింగ్టన్ రాష్ట్రానికి చెందింది. అయితే ఆమెకు 12 ఏళ్ల వయసులో జరిగిన కారు ప్రమాదం(Car Accident)లో ఎడమవైపు భాగం ముఖంతో సహా అంతా కాలిపోయింది. పైగా ఆమె జీవితాంత పేస్‌మేకర్ (కృత్రిమ గుండె) సాయంతోనే బతకాలి. అయినప్పటికీ మెుక్కవోనీ దీక్షతో వీటిన్నంటిని అధిగమించి మరీ మిస్ వరల్డ్ అమెరికా(Miss World AMerica 2021) కిరీటాన్ని గెలుచుకుంది.
లాస్ ఏంజెల్స్(Los Angeles)లోని మిస్ వరల్డ్ అమెరికా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఫైనల్లో పోటీల్లో డయానా హెడెన్(Diana Hayden) శ్రీ షైనీ కి కిరీటాన్ని బహుకరించింది. తద్వారా అమెరికాకు ప్రాతినిథ్యం వహించిన తొలి భారత సంతతి మహిళగా షైనీ గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా శ్రీ షైనీ మాట్లాడుతూ...." నేను గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నాభావాలను మాటల్లో చెప్పలేను. ఈ క్రెడిట్ అంతా మా అమ్మనాన్నలకే దక్కుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కినందుకు మిస్ వరల్డ్ అమెరికాకు ధన్యావాదులు" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
Also Read: Pandora Papers Scandal 2021: పండోరా పేపర్స్ అంటే ఏమిటి, సచిన్ పేరుందా లేదా
శ్రీ ఫోర్డ్స్ సిటీ ఆఫ్ న్యూజెర్సీ(New Jersey)లో జరిగిన పోటీలో శ్రీ 'మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2018' కిరీటాన్ని కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే. పంజాబ్ రాష్ట్రం లూధియానాలో 1996 జనవరి 6న జన్మించారు శీషైనీ(Shree Saini). ఆమెకు ఐదేళ్లు ఉన్నప్పుడు షైనీ కుటుంబం అమెరికా(America)కు వలస వచ్చింది. బాల్యంలో ఉన్నప్పడే పేదరికాన్ని దగ్గరి నుంచి చూసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి