టైమ్ మేగజైన్ ( Time magazine ) గురించి అందరికి తెలిసే ఉంటుంది. చరిత్రలో తొలిసారిగా అంటే 97 ఏళ్ల మేగజైన్ చరిత్రలో ఫస్ట్ టైమ్..టైమ్ మేగజైన్ టైటిల్ ( Time title changed ) మారి వస్తోంది. అది కూడా ఒక్కసారికే. మరింకేం త్వరపడండి..ఎందుకో తెలుసుకోండి.
ప్రపంచంలోనే పాపులర్ మేగజైన్ టైమ్ అని అందరికీ తెలుసు. ప్రపంచంలోని ప్రముఖ అంశాల్ని చెప్పడంలో ప్రత్యేక శైలి చూపిస్తుంటుంది. ఇందులో భాగంగా ఈసారి చూపించబోయే ప్రత్యేకత ఆ మేగజైన్ హిస్టరీలోనే తొలిసారి. అంటే టైమ్ మేగజైన్ ప్రారంభమైన 97 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఏకంగా టైటిల్ మారిపోయి వస్తోంది. నవంబర్ 2 వతేదీన వస్తున్న సంచిక ప్రత్యేకత ఇది. టైమ్ అనే టైటిలే ఉండదు. అదేంటని ఆశ్యర్యపోతున్నారా. అవును నిజమే.
టైమ్ మేగజైన్ టైటిల్ స్పెల్లింగ్ తెలుసు కదా. TIME అని ఉంటుంది. ఇప్పుడీ మేగజైన్ నవంబర్ 2 సంచిక మాత్రం టైటిల్ పూర్తిగా మార్చుకుని VOTE పేరుతో వస్తోంది. అంటే TIME లోని మధ్య రెండు అక్షరాలైన IM లను తొలగించి..మిగిలిన TE లకు ముందు VOలను చేర్చింది సంస్థ. ఇలా ఎందుకంటే..నవంబర్ 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ( America president elections on november 3 ) జరగనున్నాయి. మొత్తం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికలివి. అమెరికాకు ఈ అధ్యక్ష ఎన్నికలు ఎంత ముఖ్యమో చెప్పాలని టైమ్ సంస్థ భావించింది. అందుకే టైటిల్ మార్చి..ఇలా వోట్ ( Vote ) పేరుతో నవంబర్ సంచికను మార్కెట్లో రిలీజ్ చేసింది.
కవర్ పేజీ ( Cover page ) పై ఒక మహిళ.. కర్చీఫ్‌ను మాస్కులా ధరించి ఉంది. కర్చీఫ్ మీది డిజైన్లుగా బ్యాలెట్ బాక్సు, బాక్సును కాపాడుతున్నట్లుగా రెండు అరచేతులు, విడిగా ఇనుప సంకెళ్లు, ఇంకా కొన్ని ఇన్నర్ ఫోటోలున్నాయి. రానున్న రోజుల్లో కొన్ని ఘటనలు ప్రపంచాన్ని మార్చబోతున్నాయని..అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కంటే కూడా.. అని టైమ్ ఎడిటర్ ఇన్ సైడ్ లో వ్యాఖ్యానించారు. ఓటు వేయడం ద్వారా ఆ కొన్ని ఘటనల ప్రభావాన్ని అమెరికాలోని ప్రజలందరి సార్వభౌమాధికారతకు అనుకూలంగా మార్చుకోవాలని ఓటర్లకు చెప్పడమే ఆయన ఉద్దేశంలా కనిపిస్తోందని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఎందుకంటే ఒకవేళ ఈ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) ఓడిపోతే..యెస్ అంటూ పెద్దగా అరుస్తూ హర్షం వ్యక్తమయ్యేది న్యూాయార్క్ ( New york ) లోని టైమ్ కార్యాలయం నుంచే మరి. ఈ ఎన్నికల్లో ఎవరు ఓడినా..ఎవరు గెలిచినా..వోట్ టైటిల్ తో విడుదలైన టైమ మేగజైన్ మాత్రం చరిత్రలో కచ్చితంగా నిలిచిపోతుంది. అందుకే మరోసారి చెబుతున్నాం మీ అందరికీ. అరుదైనవాటిని దాచుకునే అభిరుచి మీకుంటే..ఈ మేగజైన్ ను భద్రపరుచుకోవచ్చు. Also read: Covid-19 Vaccine: నవంబర్ 2 నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణి