Twitter Ban continues: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే ట్రంప్ ఖాతాను తొలగించిన ట్విట్టర్..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 5 బిలియన్ డాలర్ల నష్టపోయింది.
డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) వర్సెస్ ట్విట్టర్ ఘర్షణ కొనసాగుతోంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, హింసకు పురిగొల్పడంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఎక్కౌంట్ ( Trump twitter account ) ను శాశ్వతంగా నిషేధించింది ట్విట్టర్. మార్కెట్ నష్టపోతున్నా సరే ట్రంప్ అండ్ కోపై చర్యలు తీసుకుంటోంది ట్విట్టర్. ట్రంప్‌పై నిషేధం విధించిన అనంతరం ట్విట్టర్ షేర్ 12 శాతం కూలిపోయింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 బిలియన్ డాలర్లు నష్టపోయింది.
అయినా ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ మద్దతుదార్లకు చెందిన దాదాపు 70 వేల ఎక్కౌంట్లను నిలిపివేసింది. ట్విట్టర్‌లో 88 మిలియన్ల ఫాలోవర్లున్నారు డోనాల్డ్ ట్రంప్‌కు.
వాషింగ్టన్ డీసీలో హింసాత్మక సంఘటనలు కొనసాగే ప్రమాదమున్నందున..వేలాది ట్రంప్ అభిమానుల ఖాతాల్ని శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు ట్విట్టర్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ( Joe biden ) ఎన్నికను ధృవీకరించేందుకు యూఎస్ కేపిటల్ ( Us Capitol ) లో ట్రంప్ మద్దతుదారులు బీభత్సం సృష్టించారు. ఈ సందర్బంగా ట్రంప్ తన మద్దతుదార్లను రెచ్చగొట్టే ట్వీట్లు చేశారు. ఈ కారణంగానే ట్విట్టర్ తన ఎక్కౌంట్‌ను నిషేధించింది.
Also read: Vijaya gadde: ట్రంప్ ట్విట్టర్ ఎక్కౌంట్ నిషేధం వెనుక తెలుగు మహిళ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook