AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన.. వైఎస్ జగన్ భుజంపై చేయివేసి పలకరించిన రఘురామ..

Mla Raghu rama: ఏపీ అసెంబ్లీ సమావేశంలో ఆసక్తికర  ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రఘురామ, మాజీ సీఎంను పలకరించారు. ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణ ఇప్పుడు వార్తలలో నిలిచింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 22, 2024, 03:22 PM IST
  • ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు..
  • వైఎస్ జగన్ ను విష్ చేసిన రఘురామ..
AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన.. వైఎస్ జగన్ భుజంపై చేయివేసి పలకరించిన రఘురామ..

Ap Assembly Raghu rama meets with ap ex cm ys jagan: ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తొలుత మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అనేదానిపై బిగ్ సస్పెన్స్ నెలకొంది. ఒకనోక సందర్భంలో ఆయన అసెంబ్లీకి రారంటూ కూడా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో అనూహ్యంగా మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశానికి హజరయ్యారు. అప్పుడు ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ.. వైఎస్ జగన్ దగ్గరకు వెళ్లి ఆయనను హయ్.. అంటూ పలకరించారు. గవర్నర్ ప్రసంగానికి నిరసనలు తెలియజేసేందుకు జగన్ నల్ల కండువాతో అసెంబ్లీకి హజరయ్యారు. ఈ నేపథ్యంలో.. రఘురామ, వైఎస్ జగన్ దగ్గరకు వెళ్లి పలకరించారు.

Read more: Crocodile: ఇదేం పైత్యం.. 300 మొసళ్లు ఉన్న సరస్సులో బైక్ తో స్టంట్.. చివరకు ఊహించని ట్విస్ట్... వీడియో వైరల్..

ప్రతిరోజు కూడా అసెంబ్లీకి సమావేశానికి రావాలని కూడా రఘురామ అన్నారని తెలుస్తోంది. దీనికి సమాధానంగా మీరే చూస్తారు కదా.. అన్నరని కూడా సమాచారం. అసెంబ్లీలో అపోసిషన్ ఉంటేనే ఆసక్తిగా ఉంటుందని రఘురామ అన్నారంట. అప్పుడైతేనే.. సమావేశాలు మజాగా నడుస్తాయని కూడా రఘురామ మాట్లాడినట్లు తెలుస్తోంది. జగన్ చేతిలో చేయు వేసి మరీ రఘురామ మాట్లాడటం, భుజంపై చేయివేయడం మాత్రం ఆసక్తిని రేకెత్తించింది. అంతేకాకుండా.. అటుగా వెళుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ను తనకు జగన్ పక్కనే సీటు వేయించాలని రఘురామ కోరారు. తప్పని సరిగా అంటూ లాబీల్లో నవ్వుకుంటూ కేశవ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఎమ్మెల్యే రఘురామను ప్రత్యేకంగా విష్ చేయడం కాస్త   ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. ఇటీవల రఘురామ వైఎస్ జగన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారని, పోలీస్ స్టేషన్లు తిప్పుతు దారుణంగా వ్యవహరించారని కూడా  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పలు సందర్భాలలో జగన్ ను వదిలేని లేదంటూకూడా వ్యాఖ్యలు రఘురామ అన్నారు.

Read more: Puja Khedkar: మహానటి.. అంటూ నెటిజన్ల పంచ్ లు.. వైరల్ గా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ మాక్ ఇంటర్వ్యూ..

మరోవపు ఇటీవల వైఎస్ జగన్ ఏపీలో శాంతి భద్రతలకు పూర్తిగా అదుపు తప్పాయని పీఎంకు లేఖ రాయడం, గవర్నర్ కు ఫిర్యాదు చేయడం, రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తీరు.. దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉందన్నారు. ఢిల్లీలో ధర్నాలు చేస్తామనడం, డబ్బులిచ్చి మరీ దండాలు పెట్టించుకుంటున్నాడని కూడా రఘురామ విమర్శించారు. వినుకోండలో కుటుంబాల మధ్య ఉన్న వివాదం వల్ల జరిగిన హత్యను.. పార్టీలకు ఆపాదించడం ఎంత వరకు కరెక్ట్ అని రఘురామ మండిపడ్డారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News