AP Ministers Ranks: తిరుపతి లడ్డూ, హోం మంత్రిత్వ శాఖ, రేషన్ బియ్యం వంటి అంశాల్లో హడావిడి చేస్తూ సంచలన ప్రకటనలు చేసిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పని తీరు ఆధారిత ర్యాంకుల్లో మాత్రం దిగువకు పడిపోయారు. ఆయన ఏకంగా పదో స్థానంలో ఉన్నారు. ఏయే మంత్రులు టాప్‌లో ఉన్నారు, ఎవరు అడుగున ఉన్నారో తెలుసుకుందాం.
పని తీరు ఆధారంగా రాష్ట్రంలోని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాంకులిస్తున్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వ కేబినెట్ మంత్రులకు చంద్రబాబు ప్రకటించిన ర్యాంకుల్లో ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు పదవ ర్యాంకు దక్కించింది. ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ర్యాంకుల్ని ప్రకటించారు. పైళ్ల క్లియరెన్స్ ఆధారంగా ఈ ర్యాంకుల నిర్ణయం జరిగింది. ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మొదటి స్థానంలో మంత్రి ఎన్ఎండి ఫరూఖ్ ఉంటే రెండో స్థానంలో కందుల దుర్గేశ్ నిలిచారు. ఇక మూడవ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్, నాలుగో స్థానంలో నాదెండ్ల మనోహర్, ఐదవ స్థానంలో బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 6వ స్థానంలో ఉంటే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ 7వ స్థానంలో నిలిచారు. ఇక ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ 8వ స్థానంలోనూ బీసీ జనార్ధన్ రెడ్డి 9వ స్థానంలోనూ ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 10వ స్థానానికి పరిమితమయ్యారు. 11వ స్థానంలో మంత్రి సవిత, 12వ స్థానంలో కొల్లు రవీంద్ర నిలిచారు. 13వ స్థానంలో గొట్టిపాటి రవికుమార్, 14వ స్థానంలో నారాయణ, 15వ స్థానంలో టీజీ భరత్ ఉన్నారు. ఇక 16వ స్థానంలో ఆనం రాంనారాయణ రెడ్డి, 17వ స్థానంలో అచ్చెన్నాయుడు, 18వ స్థానంలో రాం ప్రసాద్ రెడ్డి ఉన్నారు.
19వ స్థానంలో గుమ్మడి సంధ్యారాణి, 20వ స్థానంలో వంగలపూడి అనిత, 21వ స్థానంలో అనగాని సత్య ప్రసాద్, 22వ స్థానంలో నిమ్మల రామానాయుడు, 23వ స్థానంలో కొలుసు పార్ధసారధి, 24వ స్థానంలో పయ్యావుల కేశవ్ ఉంటే చిట్టచివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు.
Also read: AP Politics: ఏపీలో మారుతున్న సమీకరణాలు, జగన్ కోసం పనిచేయనున్న చంద్రబాబు ఎన్నికల వ్యూహకర్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి