AP Mega Dsc Notification: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తాజాగా టెట్ 2024 పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. రేపు అంటే నవంబర్ 6వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపైనే చేసినా ఇప్పటి వరకూ నోటిఫికేషన్ వెలువడలేదు. ఇప్పుడిక నిరీక్షణకు తెరపడింది.
ఏపీలో మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఇప్పటికే టెట్ పరీక్ష ఫలితాలు విడుదల కావడంతో ఉత్తీర్ణులైన అభ్యర్ధులంతా మెగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. రేపు నవంబర్ 6వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. రేపట్నించే ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 6 వరకూ అంటే నెలరోజులపాటు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఈసారి డీఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించేందుకు విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. మెగా డీఎస్సీ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి మార్చ్ 4 వరకూ జరగనున్నాయి. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 16,347 పోస్టులతో రానుంది. ఇందులో ఎస్జీటీ పోస్టులు 6371, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7725, టీజీటీ పోస్టులు 1781, పీజీటీ పోస్టులు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52, పీఈటీ పోస్టులు 132 ఉన్నాయి. రేపు నోటిఫికేషన్ వెలువడేనాటికి పోస్టు సంఖ్య మారవచ్చు. కర్నూలులో అత్యధికంగా ఎస్జీటీ పోస్టులుంటే అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి.
ఈసారి పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎస్జీటీ పోస్టులకు సిద్ధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో పరీక్షల నిర్వహణకే వారం రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో 2-3 జిల్లాలకు కలిపి ఒకేసారి పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందనేది విద్యాశాఖ పరిశీలిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.