AP Corona cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే దాదాపు స్థిరంగా ఉన్నాయి. కొత్తగా 122 మందికి కొవిడ్ పాజిటివ్ (Corona cases in AP) వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 15,568 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది.
ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా విశాఖపట్నంలో ఒకరు మరణించినట్లు ఏపీ (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది.
ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 103 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ.
ఇక ఇప్పటి వరకు మొత్తం 3,13,97,635 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 20,77,608 శాంపిళ్లు పాజిటివ్‌గా తెలినట్లు వివరించింది. మొత్తం 20,61,832 మంది కరోనాను జయించగా.. 14,498 మంది కొవిడ్‌కు (Covid deaths in AP) బలయ్యారు.
#COVIDUpdates: As on 03rd January, 2022 10:00AM
COVID Positives: 20,74,713
Discharged: 20,58,937
Deceased: 14,498
Active Cases: 1,278#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/1wUnh40Lul— ArogyaAndhra (@ArogyaAndhra) January 3, 2022
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,278 యాక్టివ్ కరోనా (Corona Active cases in AP) కేసులున్నాయి. విశాఖపట్నంలో అత్యధికంగా 236 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది ఆరోగ్య విభాగం.
మొత్తం కేసుల్లో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన వారితో పాటు.. ఏపీకి వచ్చిన ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల వారు కూడా ఉన్నట్లు వెల్లడిచింది ఆరోగ్య శాఖ.
Also read: Durgi NTR statue: దుర్గి ఘటన దురదృష్టకరం: వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి
Also read: Attempt to destroy NTR statue: దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసానికి యత్నం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook