ఆరోగ్య పరిరక్షణలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది.మొదటి స్థానంలో కేరళ నిలవగా యూపీ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ స్పందించారు. నితి ఆయోగ్ ఆరోగ్య నివేదిక ప్రకారం ఏపీ 2015-17 మధ్యకాలంలో దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ... చంద్రబాబు హయంలో ఆరోగ్య పరిరక్షణ ఏ విధంగా సాగిందో ఇదే నిదర్శనమని నారా లోకేష్ పేర్కొన్నారు. మొత్తం 23 ఆరోగ్య సూచికలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందిస్తారని..అలాంటి జాబితాలో మన రాష్ట్రం టాప్ 2 లో నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఈ ఘనత చంద్రబాబు అవిశ్రాంత కృషి ఫలితమేన్నారు.
As per NITI Aayog’s Health Index report, AP became the 2nd Best in the Country based on 23 health indicators in the period from 2015-17. This is proof of @ncbn's relentless efforts to improve the health performance of AP during his tenure as CMhttps://t.co/Cmip6hQJgc
— Lokesh Nara (@naralokesh) June 25, 2019