Teacher Transfers: ఏపీలో టీచర్ల బదిలీలకు సంబంధించి మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఏ విధమై న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా బదిలీ జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో ఏప్రిల్ నుంచి టీచర్ల బదిలీలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యమైన వివరాలు మీ కోసం.
ఆంధ్రప్రదేశ్ ఉప్యాధ్యాయులకు శుభవార్త. చాలాకాలంగా ఎదురు చూస్తున్న టీచర్ల బదిలీలకు మార్గం సుగమమైంది. ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ మొదలు కావచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు బయటికొచ్చాయి. మరోవైపు మంత్రి నారా లోకేశ్ సైతం కీలక ప్రకటన చేశారు. బదిలీల్లో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సీనియారిటీ జాబితా సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. పాఠశాల, ఇంటర్ విద్యపై సమీక్ష నిర్వహించిన ఆయన త్వరలో జీవో నెంబర్ 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థ తీసుకొస్తామన్నారు. వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం 1800 మంది ఉపాధ్యాయుల్ని కోరుకున్న స్థానాలకు బదిలీ చేసింది. అయితే ఈ బదిలీల్లో ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలతో బదిలీ ఉత్తర్వుల్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి నుంచి బదిలీల కోసం ఎదురు చూస్తున్న టీచర్లకు ఇప్పుడు మళ్లీ శుభవార్త విన్పిస్తోంది.
త్వరలో విద్యార్ధుల తల్లిదండ్రులతో సమావేశం జరగనుంది. ఉపాధ్యాయ సంఘాల నేతలో బదిలీల చట్టం ముసాయిదాపై చర్చిస్తారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 117 రద్దు, బదిలీల చట్టంపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి చేరుతాయి.
పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై జరిగిన సమీక్షలో జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ వేతనాలు పెంచాలనే డిమాండ్ విన్పించింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేశ్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదట సంవత్సరంలో కొత్త సిలబస్ ప్రవేశపెడతామని అధికారులు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఎయిడెడ్ కళాశాలల విలీనంతో జరిగిన నష్టంపై చర్చించారు. ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.
Also read: Anganwadi Gratuity: అంగన్‌వాడీలకు చంద్రబాబు వరం, గ్రాట్యుటీ అమలుకు ఆమోదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి