AndhraPradesh Politics 14 days Remand for TDP spokesperson Pattabhi Ram Kommareddy: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌కు.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తోట్లవల్లూరు పీఎస్ నుంచి పట్టాభిని (Pattabhi Ram) విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు సాయంత్రం కోర్టులో హాజరుపర్చారు. ఈసందర్భంగా పట్టాభికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని పట్టాభి తరఫు న్యాయవాది కోరారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పట్టాభిపై (Pattabhi) గతంలోనే అనేక కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే పట్టాభిపై 5 ఎఫ్‌ఐఆర్‌లు (FIR) నమోదయ్యాయని, ప్రస్తుతం ఆయన ఇతర కేసుల్లో బెయిల్‌పై (bail) ఉన్నాడని పేర్కొన్నారు.
Also read : India Vs Pakistan Match History: గెట్ రెడీ ఫర్ హై ఓట్లేజ్ మ్యాచ్.. బల్బులు పగలాల్సిం
ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పట్టాభికి 14 రోజుల రిమాండ్ (14 days Remand) విధించారు. అంతకు ముందు ప్రభుత్వాసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై (YS Jagan Mohan Reddy) పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను నిన్న రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.
Also Read : Amazon prime Price hike: 50 శాతం పెరగనున్న ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధరలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి