విశాఖ రైల్వే జోన్‌పై కీలక ప్రకటన రానుందా ?

రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి ఉత్తరాంధ్ర ప్రజానికం ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రధానమైన డిమాండ్స్‌లో ఒకటి వైజాగ్ రైల్వే జోన్. 

Last Updated : Mar 6, 2018, 04:08 PM IST
విశాఖ రైల్వే జోన్‌పై కీలక ప్రకటన రానుందా ?

రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి ఉత్తరాంధ్ర ప్రజానికం ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రధానమైన డిమాండ్స్‌లో ఒకటి వైజాగ్ రైల్వే జోన్. ప్రతీ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో దీనిపై ఓ ప్రకటన వెలువడుతుందని ఆశిస్తూ వస్తోన్న జనం ఎప్పటికప్పుడు ఆ విషయంలో భంగపాటుకు గురవుతూ వస్తున్నారు. తాజాగా ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ విశాఖ రైల్వే ప్రస్తావన లేకపోవడంతో మరోసారి ఉత్తరాంధ్ర తీవ్ర నిరాశకుగురైంది. ఇప్పటికే రాష్ట్ర విభజనతో ఎంతో నష్టపోయిన తమకు కేంద్ర బడ్జెట్‌లో మొండిచెయ్యే చూపించారు అంటూ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఉభయ సభల్లో గగ్గోలు పెట్టి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. 

ఇదిలావుంటే, మరోవైపు రాష్ట్ర విభజన హామీలు సైతం ఏవీ నెరవేరలేదు అనే ఆరోపణలు కూడా ఏపీ వైపు నుంచి ప్రధానంగా వినిపిస్తూ వస్తున్నాయి. ఇలా రకరకాలుగా అసంతృప్తితో రగిలిపోతున్న ఏపీని బుజ్జగించేందుకు చేసే ప్రయత్నాల్లో భాగంగానే తాజాగా కేంద్రం ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 

అరుణ్ జైట్లీ సహా.. పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ నేతలతో ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఢిల్లీ వర్గాలు, మీడియా కథనాల ప్రకారం మరో రెండు రోజుల్లో వైజాగ్ రైల్వే జోన్ పై ఓ కీలక ప్రకటన వెలువడే అవకాశం వుందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో చట్టరీత్యా కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏపీకి రైల్వే జోన్ అంశం కూడా ఒకటి. 

Trending News