CM Jagan: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నేతలతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈసందర్భంగా నేతలకు క్లాస్ తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలిచేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. 27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదన్నారు. గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్లడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మంత్రులు సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికైనా ఆ 27 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు పని తీరు మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వైసీపీ నేతలే గుస గుసలాడుతున్నారు. లేకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. పనితీరు మార్చుకోకపోతే టికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. నవంబర్‌లో మరోసారి ఎమ్మెల్యేల పనితీరు సమీక్షిస్తానని సీఎం జగన్ తెలిపారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే సీటు ఇవ్వని వారి పేర్లు ప్రకటిస్తానని స్పష్టం చేశారు.
దీని వల్ల అభ్యర్థులు ఎవరో తేలిపోతుందన్నారు సీఎం జగన్. గతకొంతకాలంగా పార్టీ బలోపేతంపై ఆయన దృష్టి పెట్టారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈకార్యక్రమం నిత్యం కొనసాగాలని నేతలను ఆదేశించారు. ప్రజల సంక్షేమ కోసం ఎంతో కృషి చేస్తున్నామని..ఈ విషయాన్ని వారికి తెలియజేసేలా చూడాలని ఆదేశించారు.
మరోవైపు ఇప్పటికే మంత్రులు బస్సు యాత్రలు చేపట్టారు. ప్రతి జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టడం ద్వారా..ప్రజలకు చేరువవుతున్నారు. కరోనా సమయంలోనూ ఎలాంటి పథకాలు ఆగలేదు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రులు, వైసీపీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. రానున్న ఏడాది ఎంతో కీలకమని..అందుకే నిత్యం ప్రజల్లో ఉండాలన్నారు సీఎం జగన్. ప్రభుత్వంపై టీడీపీ, బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టాలని మార్గనిర్దేశం చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో టీడీపీ స్పీడ్ పెంచింది. వైసీపీ చేసిన తప్పిదాలను ప్రజలకు వివరిస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడానికి అస్త్రంగా మార్చుకోవాలని చూస్తోంది. దీనిపై ప్రజాపోరాటం చేయాలని నిర్ణయించారు. ఇందులోభాగంగానే ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబుతోపాటు కీలక నేతలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో రానున్న ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
Also read:Visaka Railway Zone: విశాఖ కేంద్రంగానే రైల్వే జోన్..కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ..!
Also read:China Fire Accident: చైనాలో ఘోర అగ్నిప్రమాదం..17 మంది సజీవ దహనం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి