Ysr Bima Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలతో వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీమా పథకాన్ని ప్రారంభించారు. బీమా పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించనుంది.
దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారందరికీ వర్తించే విధంగా ఏపీ ప్రభుత్వం(Ap government) కొత్తగా వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. కుటుంబ పెద్ద సహజ మరణం పొందినా..ప్రమాదవశాత్తూ మరణించినా పరిహారం అందేలా వైఎస్ఆర్ బీమా పథకాన్ని తీర్చిదిద్దారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ ఈ పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో 5 లక్షల వార్షిక ఆదాయం కలిగినవారిని ఆరోగ్యశ్రీలో చేర్చామని వైఎస్ జగన్ తెలిపారు. వేయికి పైగా రోగాల్ని గుర్తించి..ఆరోగ్యశ్రీ (Arogyasri) పథకంలో చేర్చినట్టు జగన్ చెప్పారు. నూతన మార్గదర్శకాలతో (New Guidelines) ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ బీమా పథకాన్ని బ్యాంకులతో సంబంధం లేకుండా అమలు చేస్తామన్నారు.
వైఎస్ఆర్ బీమా పథకం(Ysr Bima Scheme)పై సందేహాల్ని నివృత్తి చేసేకునేందుకు 155214 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో తీసుకొచ్చామన్నారు.18-50 ఏళ్ల వ్యక్తి సహజ మరణమైతే లక్ష రూపాయులు, 18-70 ఏళ్ల వ్యక్తి ప్రమాదంలో మరణించినా లేదా అంగవైకల్యమైనా 5 లక్షల రూపాయలు అందిస్తామన్నారు. పేద కుటుంబాలపై భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వమై మొత్తం ఖర్చు భరిస్తుందన్నారు. 2020 ఏప్రిల్ నుంచి కేంద్రం దీన్నించి తప్పుకుందని గుర్తు చేశారు. 2021-22 ఏడాదికి 1.32 కోట్ల పేద కుటుంబాలకు 750 కోట్లతో బీమా కల్పిస్తామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు పూర్తి బాధ్యతలు అప్పగించామని వైఎస్ జగన్(Ap cm ys jagan)తెలిపారు. బీమా మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరించనుందని స్పష్టం చేశారు.
Also read: Viajayawada Airport: విజయవాడ విమానాశ్రయంలో నూతనంగా రన్ వే, ఈ నెల 15న ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook