AP Elections Latest Updates: లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఓటర్ల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు ఏపీ ఎన్నికల సంఘం సమీక్ష చేపట్టింది. ఎన్నికలకు అవసరమైన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
మంగళగిరిలోని సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో శుక్రవారం ముకేశ్ కుమార్ మీనా మీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సంసిద్ధత, ఓటర్ల జాబితా నవీకరణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన, నోటిఫికేషన్ జారీకి ఎక్కువ సమయం లేదని గుర్తుచేశారు. అప్పటి లోపే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తాజా మార్గదర్శకాలను ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించడం జరిగిందని తెలిపారు. వాటిపై జిల్లా ఎన్నికల అధికారులు సమగ్రంగా అవగాహన చేసుకోవాలని, సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణపై నిత్యం సమీక్షలు చేస్తూ ఎన్నికల ప్రక్రియను ఈసీ వేగవంతం చేస్తోంది. ఈనెల ఆఖరున ఎన్నికల ప్రకటన విడుదల చేసే అవకాశం ఉండడంతో రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. అధికార యంత్రాంగాన్ని ఉరుకులుపరుగులు పెట్టిస్తోంది. కాగా, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు పూర్తి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల అధికారుల బదిలీలు కూడా చేపట్టిన విషయం తెలిసిందే. వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రకటన ఎప్పుడూ వచ్చినా 'సిద్ధం' అని ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో పరిణామాలు చకాచకా మారుతుండడం చూస్తుంటే కొన్నిరోజుల్లోనే ఎన్నికల సమరం రాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Gaddar Awards: 'గద్దర్ అవార్డు'లపై సినీ పరిశ్రమ మౌనం.. తొలిసారి మోహన్ బాబు ఏమన్నారంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి