AP Govt Good News to Employees: ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏపీలో ఉద్యోగుల బదిలీ విషయంలో నిషేధం ఉంది. ఇప్పుడు ఆ నిబంధనలు సడలించారు. ఇక తాజా నిర్ణయంతో ఈ నెల 22 నుంచి 31 మధ్య ఏపీ ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి.
రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్‌లో బదిలీలకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మేరకు బదిలీలకు గైడ్ లైన్స్ విడుదల చేసిన ఏపీ సర్కార్ అందులో కొన్ని కఠినమైన నిబంధనలు కూడా పెట్టింది. ఇక తాజా నిబంధనల ప్రకారం 2 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసినవాళ్లకు రిక్వెస్ట్‌పై బదిలీకి అవకాశం కల్పిస్తారు. అలాగే ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి చేశారు.
Also Read: Samantha Next Movie: సిద్దూ హీరోగా సమంత మూవీ..అంతా సెట్ చేసిన నందిని రెడ్డి?
అనే లెక్క ప్రకారం 2023 ఏప్రిల్ నాటికి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వాళ్లు అందరూ బదిలీలకు అర్హులు. టీచర్లతో పాటు పలు ఇతర ఉద్యోగులకు వేరువేరుగా గైడ్ లైన్స్ జారీ చేసింది ప్రభుత్వం. గత ఏడాది జూన్‌లో ఓ సారి ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉద్యోగుల సాధారణ బదిలీల కోసం కొంత కాలం పాటు నిషేధాన్ని సడలించారు. గత ఏడాది కూడా ఐదేళ్ల పైబడిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.
ఇక బదిలీలపై నిషేధం ఏత్తి వేసి పూర్తి స్థాయి బదిలీలకు అవకాశం కల్పించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలపై మాత్రం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏమాత్రం స్పష్టత ఇవ్వ లేదు. చాలా కాలంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు కోరుకుంటున్నా ఉద్యోగుల ఆశలు ఇప్పట్లో నెరవేరే అవకాశాలు కనపడటం లేదు. ప్రస్తుతం జారీ చేసిన ఉద్యోగుల బదిలీల్లో కూడా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల గురించి చెప్పకపోవడంతో ఆయా ఉద్యోగులు అయితే నిరాశకు గురవుతున్నారు.
Also Read: Aishwarya Rajesh: నేను రష్మికని ఏం అనలేదు.. ఐశ్వర్యా రాజేష్ క్లారిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి