APMDC MD Venkat Reddy says no illegal mining in Kuppam constituency : ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం అటవీ భూములు, ద్రవిడ యూనివర్సిటీకి కేటాయించిన భూముల్లో ప్రస్తుతం ఎలాంటి మైనింగ్ జరగడం లేదని ఏపీ గనులు, భూగర్భ శాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి (VG Venkatereddy) తెలిపారు. తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కుప్పం (Kuppam) పర్యటన సందర్భంగా సందర్శించిన క్వారీ (quarry) ప్రాంతాల్లో 2019 కు ముందు మైనింగ్ (Mining) జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అక్కడ ఎలాంటి మైనింగ్ జరగడం లేదన్నారు.
ఏపీలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమ మైనింగ్ ఉక్కుపాదం మోపారన్నారు. దీంతో కుప్పం అటవీ భూములు, (Forest lands) ద్రవిడ యూనివర్సిటీ (Dravida University) భూముల్లో ఎలాంటి అక్రమ మైనింగ్ కొనసాగడం లేదన్నారు. అక్రమ మైనింగ్‌ను (Illegal mining) గనుల శాఖ పూర్తి స్థాయిలో నియంత్రించిందని తెలిపారు.
2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో గనులశాఖ నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 4787 క్యూబిక్ మీటర్ల పరిమాణం ఉన్న 555 గ్రానైట్ బ్లాక్స్ సీజ్ చేశామని వెంకటరెడ్డి (Venkatereddy) వెల్లడించారు.
Also Read : AP corona updates: ఏపీలో కరోనా విజృంభణ... రెట్టింపయిన కేసులు.. కొత్తగా 1,831 మందికి పాజిటివ్!
గతంలో 3 జిల్లాలకు ఒక విజిలెన్స్ స్క్వాడ్ (Vigilance Squad) ఉంటే.. ప్రస్తుతం ప్రతి జిల్లాకు ఒక స్క్వాడ్ ఉందని పేర్కొన్నారు. దీంతో ఏపీలో అక్రమ మైనింగ్‌ను పూర్తిగా నియంత్రించామన్నారు. ఇక కుప్పం నియోజకవర్గం (Kuppam constituency) శాంతిపురం మండలం, ద్రవిడ యూనివర్సిటీ భూముల్లో మైనింగ్ ఆరోపణలపై గనుల శాఖ మహాచెక్ నిర్వహించిదన్నారు. 4 ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టామన్నారు. మైనింగ్ (Mining) తనిఖీల్లో భాగంగా మూడంచెల తనిఖీ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
Also Read : AP Rains Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, మూడ్రోజులు ఏపీలో వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook