Jagananna Vidya Kanuka: వైఎస్ జగన్ మరో కొత్త స్టిక్కర్ కార్యక్రమం: విష్ణువర్ధన్ రెడ్డి

జగనన్న విద్యా కానుక (Jagananna Vidya Kanuka)ను వైఎస్ జగన్ మరో కొత్త స్టికర్ కార్యక్రమంగా అభివర్ణించారు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy).

Last Updated : Oct 9, 2020, 04:02 PM IST
  • వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ప్రారంభించిన కార్యక్రమం జగనన్న విద్యా కానుక
  • ‘జగనన్న విద్యా కానుక’ను మరో కొత్త స్టికర్ కార్యక్రమంగా అభివర్ణించిన విష్ణువర్ధన్ రెడ్డి
  • వైఎస్ జగన్ పథకాలపై వాస్తవాలు ఇవేనంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి వరుస ట్వీట్లు
Jagananna Vidya Kanuka: వైఎస్ జగన్ మరో కొత్త స్టిక్కర్ కార్యక్రమం: విష్ణువర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ప్రారంభించిన కార్యక్రమం జగనన్న విద్యా కానుక (Jagananna Vidya Kanuka). స్కూల్ విద్యార్థులకు సంబంధించి ప్రారంభించిన పథకంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ నిజాలు దాచిపెట్టారని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. జగనన్న విద్యా కానుక పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా.. కేంద్ర ప్రభుత్వ సహకారానికి, కేంద్రం పేరు చెప్పకుండా, ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో వేయకుండా.. మీ స్టికర్ వేయడంలో మీకు (వైఎస్ జగన్) మీరే సాటి. ప్రజలు అన్ని గమనిస్తున్నారంటూ ట్వీట్లు చేశారు. ‘జగనన్న విద్యా కానుక’ను వైఎస్ జగన్ మరో కొత్త స్టికర్ కార్యక్రమంగా అభివర్ణించారు.

వాస్తవానికి ఈ పథకంలో భాగం కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తుంటే, ఏపీ ప్రభుత్వం 40 శాతం వాటా నిధులనే ఇస్తుందని తెలిపారు. వైఎస్ జగన్ ఇకనైనా మారాలంటూ మండిపడ్డారు. ప్రభుత్వ నిధుల పథకాలకు సొంత పేర్లను నిషేధించాలన్నారు. జగనన్న విద్యాదీవెనలో 60 శాతం నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను వరుస ట్వీట్లలో ప్రశ్నించారు. జగనన్న గోరుముద్దలో 60 శాతం నిధులు కేంద్రం ఇచ్చిందని, ఇప్పుడు జగనన్న విద్యా కానుకలో సైతం జరుగుతున్నది అదేనంటూ విమర్శించారు. 

 

 

వైఎస్ జగన్ ఇప్పటికైనా మారాలని, ఆయనలో మార్పు రావాలని హితవు పలికారు. కేంద్రం నిధులు ఇస్తున్నందున ప్రధాని మోదీ ఫొటో సైతం ఉండాలని, లేకపోతే కేంద్రం నిధులు ఇచ్చిందన్న విషయం ఏపీ ప్రజలకు ఎలా తెలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. నిధులకు సంబంధించిన వివరాలను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy) షేర్ చేశారు. 

 

 

*విద్యాశాఖమంత్రి సురేష్ గారు ప్రభుత్వ పథకాలకు వైఎస్ జగన్ గారి పేరు వారి కుటుంబ ట్రస్ట్ నిధుల ఖర్చు పెట్టి సేవ చేస్తే అభ్యంతరం ఉండదు.60% కేంద్ర మరియ 40%రాష్ట్ర నిధులతో నిర్వహించే పథకాలకు ఈ స్వంత డబ్బ కొట్టుకోవడానికి వెచ్చించే ఆలోచనలు విద్య ప్రమాణాల పై దృష్టి పెడితే ప్రజలు హర్షిస్తారు’ అని మరో ట్వీట్ చేశారు.   YSRCP Leader Murder: వాకింగ్‌కు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News