BJP Master Plan: చంద్రబాబుకు దీటుగా బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌.. 22 జిల్లాల అధ్యక్షుల ఎంపిక

BJP Master Plan Against To Chandrababu With Party Appointments: టీడీపీ అధినేత చంద్రబాబుకు దీటుగా బీజేపీ వ్యూహం రచిస్తున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు జరిగినా పార్టీ దెబ్బతినకుండా కాషాయ పార్టీ పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జిల్లాల అధ్యక్షుల ఎంపిక అని చర్చ జరుగుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 22, 2025, 02:19 PM IST
BJP Master Plan: చంద్రబాబుకు దీటుగా బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌.. 22 జిల్లాల అధ్యక్షుల ఎంపిక

AP BJP Master Plan: ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా రాజకీయాలు మారేట్టు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో లుకలుకలు తీవ్రమవుతున్న వేళ బీజేపీ భారీ వ్యూహం పన్నింది. తమ మిత్రపక్షాలకు దీటుగా బలోపేతం కావాలని కాషాయ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటనతో ఏపీ బీజేపీలో జోష్‌ రాగా.. తాజాగా జిల్లాల అధ్యక్షుల నియామకం చేపట్టారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కొత్త కార్యవర్గాన్ని నియమించింది. భవిష్యత్‌లో చంద్రబాబు మిత్రబంధానికి బై బై చెబితే క్షేత్రస్థాయిలో గట్టిగా నిలబడేందుకు బీజేపీ ప్రణాళికలు వేసినట్లు తెలిసింది.

Also Read: Glass Symbol: పవన్‌ కల్యాణ్‌కు భారీ శుభవార్త.. జనసేనకు శాశ్వతంగా గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్

ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల అధ్యక్షులను బీజేపీ నియమించింది. 22 జిల్లాల అధ్యక్షులను నియమిస్తూ బీజేపీ ప్రకటన విడుదల చేసింది. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు మున్సిపల్‌ ఇతర ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఏ్పడినా కూడా తట్టుకుని నిలబడేలా పార్టీ అధిష్టానం సూచనలతో స్థానిక నాయకత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లాల అధ్యక్షులను కాషాయ పార్టీ నియమించింది. 

Also Read: Liquor Shops: ఏపీలో మళ్లీ వైన్స్‌ దుకాణాలకు దరఖాస్తులు.. అదృష్టం పరీక్షించుకోండి

కొత్తగా నియమితులైన జిల్లాల అధ్యక్షులు వీరే..!

  1. మన్యం జిల్లా- డి.శ్రీనివాసరావు
  2. అల్లూరి జిల్లా- ఎం.శాంతకుమారి
  3. శ్రీకాకుళం- ఎస్.తేజేశ్వరరావు
  4. విజయనగరం- యు.రాజేష్ వర్మ
  5. విశాఖపట్టణం- ఎం.పరశురాంరాజు
  6. అనకాపల్లి- డి.పరమేశ్వరరావు
  7. కాకినాడ- బి.విశ్వేశ్వరరావు
  8. కోనసీమ జిల్లా- ఎ. సత్యనారాయణ
  9. తూర్పు గోదావరి- పి.నాగేంద్ర
  10. పశ్చిమ గోదావరి- ఐనంపూడి శ్రీదేవి
  11. ఏలూరు జిల్లా- సీహెచ్ విక్రమ్ కిశోర్
  12. ఎన్టీఆర్ జిల్లా- అడ్డూరి శ్రీరామ్
  13. గుంటూరు- చెరుకూరి తిరుపతిరావు
  14. పల్నాడు- వి.ఎం.శశికుమార్
  15. ఒంగోలు- సెగ్గం శ్రీనివాసులు
  16. నెల్లూరు- వంశీధర్ రెడ్డి
  17. చిత్తూరు- ఎస్.జగదీశ్వర్ నాయుడు
  18. కడప- జె. వెంకటసుబ్బారెడ్డి
  19. సత్యసాయి జిల్లా- జి. మోహన్ శేఖర్
  20. అనంతపురం- కె.రాజేష్
  21. కర్నూలు- బి.రామకృష్ణ పరమహంస
  22. నంద్యాల- అభిరుచి మధు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News