Pawan kalyan body shaming controversy: దేశ మంతట ఎక్కడ చూసిన కూడా ప్రస్తుతం కుంభమేళ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. మన దేశంనుంచి మాత్రమే కాకుండా.. ప్రపంచ దేశాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తున్నారు. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళ కావడంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎలాగైన సరే.. కుంభమేళలో పుణ్నస్నానాలు చేసి తీరాలని భక్తులు సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కుంభమేళలకు రాజకీయనాయకులతో పాటు, సెలబ్రీటీలు కూడా భారీగా పొటెత్తారు.
ఈ క్రమంలో ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజీనోవా, కుమారుడు అకీరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్, టీటీడీ సభ్యుడు ఆనంద్ సాయితో కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు. అంతే కాకుండా.. కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించి, గంగాదేవీకి ప్రత్యేకంగా పూజలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పుణ్యస్నానాలు ఆచరించే క్రమంలో ఆయన తన షర్ట్ తీసి కన్పించారు.
దీంతో సోషల్ మీడియాలో కొంత మంది ఆయన బాడీషేమింగ్ చేస్తు కాంట్రవర్సీగా పోస్ట్ లు పెట్టారు. పవన్ పొట్ట ఏంటీ ఇలా అయిపోయిందని..మరికొందరు రాజకీయాల్లో వస్తే ఇలానే అని.. కాంట్రవర్సీగా పోస్టులు పెట్టి ట్రోల్స్ చేశారు. మరికొందరు పవన్ కళ్యాణ్ ను సంపూర్ణేష్ బాబుతో పోలుస్తూ పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో ప్రస్తుతం దీనిపై ఏపీ పోలీసులు సీరియస్ అయ్యారు.
ఇటీవల సినీ నటుడు సంపూర్ణేష్ బాబుతో.. పవన్ కళ్యాణ్ ను పోలుస్తూ harsha reddy @Harsha 88889x సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో పోస్ట్ అయ్యింది. దీనిపై పోలీసులు కేసునమోదు చేశారు. దీనిపై జనసేన నాయకుడు రిషికేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. రిషికేష్ ఫిర్యాదుతో నెల్లూరులోని కావలి రెండో పట్టణం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉపముఖ్యమంత్రిని కించపరుస్తూ ఇలా అనుచిత పోస్టు పెట్టడం పట్ల కూటమి నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై ప్రస్తుతం ఏపీలో మరోసారి వైసీపీ వర్సెస్ కూటమిగా ట్విట్ ల వార్ కొనసాగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.