Big Breaking: తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె ఉమామహేశ్వరి కన్నుమూశారు. అయితే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన స్వర్గీయ ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మరణించారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉమామహేశ్వరి ఇవాళ కాస్సేపటి క్రితం కన్నుమూశారు. ఈమె మృతితో ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం అలముకుంది. ఉమామహేశ్వరి మరణవార్త విని..మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ఆమె ఇంటికి వెళ్లారు. అయితే ఆమెది సహజ మరణం కాదని తెలిసింది. ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించినట్టు సమాచారం. ఆమె ఆత్మహత్యకు కారణం ఆమె అనారోగ్యమని కూడా కొందరు చెబుతున్నారు.
ఉమామహేశ్వరి ఆత్మహత్య కారణాలేంటి
ఎన్టీఆర్ కుటుంబంలో చిన్న కుమార్తెగా ఉన్న ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మానసిక సమస్యలు, ఒత్తిడి కారణంగా ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. కుటుంబసభ్యుల అనుమానం మేరకే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి..మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.
ఎన్టీఆర్ నలుగురు కుమార్తెల్లో ఉమా మహేశ్వరి నాలుగవ కుమార్తె.పెద్ద కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి కాగా, రెండవ కుమార్తె చంద్రబాబు భార్య భువనేశ్వరి, మూడవ కుమార్తె లోకేశ్వరి. ఇటీవలే ఉమామహేశ్వరి కుమార్తె వివాహం కూడా జరిగింది. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఇప్పటి వరకూ ఏ విధమైన ప్రకటన రాలేదు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులేంటనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.
Also read: Chandrababu: చంద్రబాబుకు మోడీ సర్కార్ ఆహ్వానం.. బీజేపీ-టీడీపీ పొత్తు కుదిరినట్టేనా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook