అమరావతి: ఏపీలో విద్యా రంగం పూర్తి వ్యాపారంగా మారిందని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తమ ప్రభుత్వం విద్యకే అధిక ప్రాధాన్యం ఇస్తుందని మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అంతేకాకుండా బడి ఈడు పిల్లలను బడికి పంపించేలా అమ్మఒడి పథకాన్ని సైతం ప్రవేశపెట్టారు. పిల్లలను బడికి పంపించే ప్రతీ తల్లికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం చేయడమే ఈ అమ్మఒడి పథకం ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో నేడు ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్లో విద్యా రంగానికి, విద్యకు ముడిపడి ఉండే పథకాలకు దేనికెంత కేటాయించారనే వివరాలు క్లుప్తంగా ఇలా వున్నాయి.
విద్యారంగానికి మొత్తం రూ. 32,618 కోట్లు,
ఉన్నత విద్య రూ. 3,021.63 కోట్లు,
అమ్మఒడి పథకానికి రూ. 6,455 కోట్లు
పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ. 1,500 కోట్లు
మధ్యాహ్న భోజన పథకానికి రూ. 1,077 కోట్లు
పాఠశాలల నిర్వహణ వ్యయం గ్రాంటుకు రూ. 160 కోట్లు