KS Bharat Debut 1st Test Ind Vs Aus: తెలుగు కుర్రాడు, ఆంధ్ర రంజీ ప్లేయర్ కోన శ్రీకర్ భరత్ నిరీక్షణ ఫలించింది. టీమిండియా తరుఫున ఆడాలానే చిరకాల కోరిక నెరవేరింది. ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భరత్‌కు భరత్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చేతేశ్వర్ పుజారా చేతుల మీదుగా అతడు టీమిండియా క్యాప్ అందుకున్నాడు. ఆస్ట్రేలియాపై తొలి టెస్టు ఆడుతున్న కేఎస్ భరత్ జెర్సీ నంబర్ 14. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం కారణంగా భారత జట్టుకు వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం మనోడికి దక్కింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేఎస్ భరత్ టెస్టుల్లో అదరగొట్టాలని కోరుకుంటున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మంత్రి రోజా తదితరులు కేఎస్ భరత్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో టీమిండియా తరుఫున అరంగేట్రం చేస్తున్న కేఎస్ భరత్‌కు అభినందనలు అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. తెలుగు జెండా రెపరెపలాడుతోందని.. భరత్ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
Our very own @KonaBharat is debuting today with the Indian Cricket Team in the ongoing test against Australia. My congratulations and best wishes to him.
The Telugu flag continues to fly high!#TeluguPride pic.twitter.com/KlDACbHBhF— YS Jagan Mohan Reddy (@ysjagan) February 9, 2023
టీమిండియా తరుఫున కేఎస్ భరత్ ఆడుతుండడం సంతోషంగా ఉందని అన్నారు చంద్రబాబు నాయుడు. భరత్‌కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. మన దేశం గర్వపడేలా చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భరత్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Happy to learn that our very own @KonaBharat will make his debut in the first cricket test against Australia today. I wish him all the very best and look forward to seeing him make our country proud. pic.twitter.com/enVRQjr2fV
— N Chandrababu Naidu (@ncbn) February 9, 2023
ఇక ఏపీ మంత్రి రోజా ముందుగానే కేఎస్ భరత్‌కు విషెస్ చెప్పడం విశేషం. జట్టులో భరత్‌కు కచ్చితంగా చోటు దక్కుతుందని రోజా ఊహించారు. ముందురోజే ఆల్ ద బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రోజా చేసి ట్వీట్ వైరల్ అవుతోంది. భరత్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్లేస్ గ్యారంటీ అని ముందుగానే మంత్రి గెస్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు.
You are absolutely unique and all the best @KonaBharat give your best, see result will be TheBest 🏏 #INDvsAUS pic.twitter.com/E3v7LI0PUg
— Roja Selvamani (@RojaSelvamaniRK) February 8, 2023
'మన దేశ క్రికెట్ జట్టు తరఫున తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఆంధ్రప్రదేశ్ యువ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. వికెట్ కీపర్‌గా, బ్యాటర్ గా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఉత్తమ ప్రతిభ చూపించారు. ఆ మ్యాచుల్లో ట్రిపుల్ సెంచరీతో తన ప్రతిభ చూపిన భరత్ జాతీయ జట్టులో కూడా రాణించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ యువ క్రికెటర్ స్పూర్తితో... రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత మంది యువతీ యువకులు క్రీడా రంగం వైపు ఉత్సాహంగా ముందుకు రావాలి...' అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచించారు.
Also Read: TSRTC: పెళ్లిళ్ల సీజన్‌లో టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. సూపర్ డిస్కౌంట్
Also Read: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు విద్యార్థులు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook