CM Jagan Review: ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. మళ్లీ ఛాన్స్..!

CM Jagan Review On Education Department: అన్ని స్కూళ్లలో ఇంటర్‌నెట్ సదుపాయ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. సెప్టెంబర్ నెల చివరి వరకు 45 వేల స్కూళ్లలో ఇంటర్‌నెట్ సదుపాయం కల్పిస్తామని అధికారులు వివరించారు. డ్రాప్‌అవుట్స్‌ లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 8, 2023, 06:47 PM IST
CM Jagan Review: ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. మళ్లీ ఛాన్స్..!

CM Jagan Review On Education Department: ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కాలేజీలు ఉండేలా చూసుకోవాలని అధికారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఇందులో ఒకటి బాలికల కోసం ప్రత్యేకంగా ఉండాలని.. మరోకటి కో ఎడ్యుకేషన్‌ ఉండాలని చెప్పారు. జనాభా అధికంగా ఉన్న ఆ మండలంలోని రెండు గ్రామాలు లేదా పట్టణాల్లో రెండు హైస్కూల్స్‌ను ఏర్పాటుచేసి వాటిని జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయాలన్నారు. వచ్చే జూన్‌ నాటికి ఈ జూనియర్‌ కళాశాలలు ఏర్పాటయ్యేలా చూడాలని ఆదేశించారు. నాడు–నేడు ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని.. సరిపోయే సిబ్బందిని కూడా నియమించాలన్నారు. విద్యాశాఖపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. 

విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. ఈ ఏడాది  అన్ని తరహా ప్రభుత్వ స్కూళ్లలో మొదటి‌ 10 ర్యాంకులను 64 మంది విద్యార్థులు సాధించారని చెప్పారు. స్కూళ్లలో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా.. సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ అమలు జరిగేలా బదిలీలు చేపడుతున్నామని వివరించారు. యూనిట్‌ టెస్టుల్లో వెనకబడిన విద్యార్థులను గుర్తిస్తామని.. వారికి మరింత బోధన, శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్ని తరహా ప్రభుత్వ కాలేజీలలో మొదట‌ 10 ర్యాంకులను 27 మంది విద్యార్ధులు సాధించినట్లు ముఖ్యమంత్రికి చెప్పారు. 

మొదటి దశ నాడు–నేడు పూర్తి చేసుకున్న పాఠశాలల్లో ఆరోతరగతి పైబడిన తరగతుల్లో EFP ప్యానెల్స్‌ ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్షించారు. అదేవిధంగా ప్యానెల్స్‌ వినియోగంపై టీచర్లకు శిక్షణ కార్యక్రమాలపై ఆరా తీశారు. ప్యానెల్స్‌ను ఎలా వినియోగించాలనే విషయంపై వీడియో కంటెంట్‌ టీచర్లకు పంపించాలని సూచించారు. EFPలతో పాటు స్మార్ట్‌ టీవీల వినియోగం, ట్యాబులు, బైజూస్‌ యాప్‌పై కూడా టీచర్లకు శిక్షణ అందిస్తామన్న అధికారులు వివరించారు. అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి.. 45వేల స్కూళ్లలో ఇంటర్న్‌నెట్‌ సౌకర్యం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు నెల చివర నాటికి స్కూళ్లకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

Also Read: Ind vs Aus WTC Final Highlights: ఫైనల్ టెస్ట్‌లో ఆసీస్ జోరు.. తొలి రోజు రోహిత్ శర్మ చేసిన మూడు తప్పులు ఇవే..!

పిల్లలు అందరూ తప్పనిసరిగా స్కూల్లో చేరాలని.. 100 శాతం GER‌ సాధించే దిశగా ముందుకు సాగాలని ఆదేశించారు సీఎం జగన్. డ్రాప్‌అవుట్స్‌ లేకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు స్పందిస్తూ.. డ్రాపౌట్స్‌ నివారణకు గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల సహకారం తీసుకోనున్నట్లు చెప్పారు. పదో తరగతి, 12వ తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు తిరిగి అడ్మిషన్‌ ఇస్తున్నామని వివరించారు. తద్వారా వారు చదువులో ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా అకడమిక్‌ క్యాలెండర్‌ 2023–24ను ముఖ్యమంత్రి విడుదల చేశారు. జూన్‌ 12న తిరిగి  పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 

Also Read: RBI Repo Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ.. రెపో రేటుపై కీలక ప్రకటన  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News