congress leader rahul gandhi election campaign for ys sharmila in kadapa: ఎన్నికల ప్రచారం ముగియడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిఉన్నాయి. ఈ క్రమంలో అన్నిపార్టీల ముఖ్యనేతలు సుడిగాలి ప్రచారంను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కడపలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి రాజీవ్ గాంధీ, దివంగత నేత వైఎస్సాఆర్ సోదర భావంతో ఉండేవారన్నారు. తన సోదరి షర్మిలను భారీ మెజార్టీతో గెలిపించి లోక్ సభకు పంపించాలని కోరారు. వైఎస్ కుటుంబానికి, తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు.దివంగత నేత వైఎస్సార్ దేశానికి మార్గదర్శకుడని, ఆయన పాదయాత్ర స్పూర్తితోనే, భారత్ జోడో యాత్రను చేపట్టానని తెలిపారు.తనకు అన్ని విషయాల్లో వైఎస్ మార్గద్శకుడిగా నిలిచాడని రాహుల్ అన్నారు. పాదయాత్ర చేయడం వల్లనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలు తెలుసుకొవచ్చని అన్నారు. వైఎస్సార్ గతంలో చెప్పిన విధంగానే పాదయాత్రతో భారత్ జోడో యాత్రను చేపట్టినట్లు తెలిపారు.
Read more: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...
వైఎస్సార్ సామాజిక న్యాయం కోసం రాజకీయాలు చేశారన్నారు. కానీ ఇప్పుడు అదిలేదని, ఏపీలో అరాచక పాలన నడుస్తోందన్నారు. ఇప్పుడు మార్పు రాజకీయాలు అవసరమని అన్నారు. వైఎస్సార్.. డిల్లీలో ఏపి హక్కులపై పోరాటం చేసే వాళ్ళని, కానీ ఇప్పుడు.. ఏపీ వైసీపీ ప్రభుత్వం బీజేపీకి బీ టీమ్ గా ఉందని విమర్శించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఎద్దేవా చేశారు. వీళ్ళ రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోడీ చేతిలో ఉంటుందని, వీరిపై సీబీఐ, ఈడీలు రైడ్ లు జరగకుండా మోదీ చెప్పిందే చేస్తుంటారని విమర్శించారు. వైఎస్సార్ సిద్దాంతం,కాంగ్రెస్ సిద్ధాంత బీజేపీని వ్యతిరేకంగా పోరాడమే అన్నారు. కానీ జగన్ మాత్రం బీజేపీతో రహాస్య ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. జగన్ మాట్లాడితే ఆయనపై కేసులు ఓపెన్ చేస్తారని అందుకే ఆయన బీజేపీతో దోస్తీ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
వైఎస్ జగన్, చంద్రబాబులకు , బీజేపీ అంటేభయమని అందుకే వీళ్లు మోదీ చెప్పిన పని చేస్తుంటారని ఫైర్ అయ్యారు. AP విభజన అయ్యాక బీజేపీ ఎన్నో హామీలు చేసిందని గుర్తుచేశారు. ఇచ్చిన వాగ్దానాలను ఒక్కటి అమలు చేయలేదని, ప్రత్యేక హోదా వచ్చిందా ?.. పోలవరం కట్టారా ?..కడప స్టీల్ కట్టారా ?, బీజేపీ ముందు ఏపి ఆత్మ గౌరవం తల దించుకొని ఉందని విమర్శించారు. ఏపిలో అవినీతి సర్కార్ నడుస్తుందన్నారు. 2014 లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో వచ్చి ఉంటే అన్ని హామీలు నెరవేర్చేవారమన్నారు. ప్రస్తుతం.. 2024 లో కాంగ్రెస్ అధికారంలో వచ్చాకా ఇచ్చిన ప్రతి వాగ్ధానం అమలు చేస్తామని గుర్తు చేశారు. 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తాం, పోలవరం ప్రాజెక్టు కడతాం, కడప స్టీల్ ప్లాంట్ కడతాం, అసెంబ్లీ ఎన్నికల్లో మేము కొన్ని వాగ్ధానాలు ఇచ్చామన్నారు.
అదే విధంగా.. 2 లక్షల రుణమాఫీ చేస్తాం, KG TO PG ఉచిత విద్య అమలు చేస్తాం, నిరుపేదలకు పక్కా ఇండ్లు కట్టించి ఇస్తాం, 2.25లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. చరిత్రలో ఎవరు చేయని ఆలోచనలు చేస్తున్నాం. ప్రతి కుటుంభం నుంచి ఒక బీద మహిళను ఎంపిక చేస్తాం. ఆ మహిళకు బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయలు ఏడాదికి ఇస్తామని, ప్రతి నెల 8500 రూపాయలు ఇస్తామన్నారు.దీంతో కోట్లాది మంది జీవిత శైలి మారుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్ భావాలు ఒక్కటేనని, నా చెల్లెలు వైఎస్ షర్మిలను భారీ మెజార్టీతో గెలిపించి, లోక్ సభకు పంపాలంటూ రాహుల్ గాంధీ ప్రజలను కడప ఎన్నికల ప్రచారంలో కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter