AP Government: ఏపీ ప్రభుత్వం చేపట్టిన పథకాల్ని సీపీఐ నేతలు ప్రశంసిస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలో పేద ప్రజల్ని ఆదుకున్నది వైఎస్ జగన్ సంక్షేమ పథకాలేనని అంటున్నారు.
ఏపీ ప్రభుత్వానికి (Ap government)వామపక్షపార్టీలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని సీపీఐ స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారు. కరోనా సంక్షోభ(Corona Crisis) సమయంలో ఆ పథకాలే పేద ప్రజల్ని ఆదుకున్నాయని కీర్తించారు సీపీఐ నేతలు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన సంక్షేమ పథకాల్ని, నగదు పంపిణీని తాము అసలు వ్యతిరేకించడం లేదని చెప్పారు. జగన్ ప్రభుత్వానికి తాము వ్యతిరేకమనే భావన కల్పించేలా కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్ని ఖండించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని కోరుతున్నామన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi)పాలనలో ఉన్నవి పోయావే తప్ప..కొత్త ఉద్యోగాలు రాలేదని సీపీఐ (CPI)మండిపడింది. కరోనా సంక్షోభంలో మాత్రం రాష్ట్రంలో సీఎం జగన్ పథకాలు (Welfare Schemes)పేదలకు ఊరటనిచ్చాయన్నారు. విశాఖ ఉద్యమాన్ని 13 జిల్లాలకు విస్తరింపజేయనున్నట్టు సీపీఐ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ రాజకీయ, ఆర్ధిక పరిపాలనా వైఫల్యాన్ని నిరసిస్తున్నామని సీపీఐ పేర్కొంది.
Also read: ఏపీలో రానున్న రెండ్రోజుల్లో వర్షాలు, 16వ తేదీన అల్పపీడనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook