AP News: ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. కొడుకు ఆత్మహత్య చేసుకోగా...అతడి మరణాన్ని జీర్ణించుకోలేని అమ్మ, అమ్మమ్మ కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం(Bhimavaram)లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District) భీమవరం టూ టౌన్ దిర్సుమర్రువారి వీధిలో వేమలమంద యోగేశ్వర వెంకట కార్తీక్ (35) తన తల్లి ఇందిరాప్రియ(50), అమ్మమ్మ గొట్టుముక్కల రాధాకృష్ణకుమారి(75)లతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. తండ్రి గతంలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అవివాహితుడైన కార్తీక్ భీమవరంలో ఆక్వేరియం వ్యాపారం చేస్తున్నాడు. అతను తరచూ విజయవాడ(Vijayawada) వస్తుంటాడు. కార్తీక్ ఈ నెల 7వ తేదీ సాయంత్రం గవర్నర్‌పేట పిన్నెలవారివీధిలోని ఓ లాడ్జిలో దిగి...ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Also Read: Covid Vaccine: చనిపోయిన మహిళకు టీకా రెండో డోస్..!
కార్తీక్ మరణవార్త తెలియగానే భీమవరం(Bhimavaram)లో ఉన్న తల్లి ఇందిరాప్రియ, అమ్మమ్మ రాధాకృష్ణకుమారిలు తీవ్ర మనస్తాపం చెందారు. నిన్న ఉదయం ఇంట్లోనే వారు కూడా ఫ్యాన్లకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కార్తీక్ ఆత్మహత్య(Suicide)కు కారణాలపై విజయవాడ పోలీసులు ఆరాతీశారు. ఆక్వేరియం వ్యాపారంలో నష్టం రావటంతో అతను చెన్నై వెళ్లాడని, ఆ సమయంలో కొవిడ్ సోకటంతో వైద్యం కోసం రూ.లక్షల్లో అప్పులు చేయాల్సి వచ్చిందని తెలిసింది. అరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులే అతడి మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook