Record Price for 1Kg Drumsticks: ఇప్పటికే పెరిగిన కూరగాయ ధరలు (Vegetable Prices)సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కిలో టమాటా (Tomato Price) హైదరాబాద్‌లో రూ.100కి చేరింది. బెండకాయ, వంకాయ వంటి కూరగాయలు కూడా కిలో రూ.100కి కాస్త అటు ఇటుగా ఉన్నాయి. తాజాగా మునగకాయ ధర ఉన్నట్టుండి భారీగా పెరిగింది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మార్కెట్లో కిలో మునగకాయ ఏకంగా రూ.600 పలుకుతోంది. దీంతో సామాన్యులు వామ్మో అంటున్న పరిస్థితి.
గత నెలలో చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఇక్కడ చాలా పంటలు దెబ్బతిన్నాయి. వాటిల్లో మునగ సాగు కూడా ఒకటి. దీంతో తమిళనాడు నుంచి మదనపల్లె మార్కెట్‌కు (Madanapalle Market) మునగకాయలు దిగుమతి అవుతున్నాయి. సాధారణంగా ఒక్కో మునగాయ రూ.10-రూ.15 ఉంటుంది. కిలోకి ఎంత లేదన్నా 15 మునగకాయలు తూగుతాయి. ఈ లెక్కన కిలో మునగకాయ ధర (Drumsticks Price) రూ.150కి కాస్త అటు ఇటుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ధర సుమారు నాలుగు రెట్లు పెరిగింది. అంటే ఒక్క మునగకాయ రూ.30 నుంచి రూ.40 పలుకుతోంది. దీంతో సామాన్యులు మునగకాయ కొనాలంటేనే భయపడిపోయే పరిస్థితి వచ్చింది.
మునగకాయలో (Drumsticks) పోషకాలతో పాటు మంచి ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే పలు రకాల మందుల తయారీలోనూ దీన్ని ఉపయోగిస్తుంటారు. ఇక రుచి పరంగా చెప్పేదేముంది... సాంబార్లో మునగకాయ ముక్క నోటికి తగిలితే అద్భుతహా అనాల్సిందే. అలాంటి మునగకాయ ధర ఇప్పుడు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యుల సాంబార్లో అది లేని వెలితి తప్పేలా లేదు. పెరిగిన మునగకాయ ధర (Vegetable Prices) ఇప్పట్లో దిగుతుందా.. లేదా.. అన్నది వేచి చూడాలి.
Also Read: Gold Smuggling: మలద్వారంలో 7.3కిలోల బంగారం-శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నలుగురి అరెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook