Mirchi Crop Farmers: గంటల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మిర్చి రైతులకు న్యాయం చేయాలని అలా చేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన చేపట్టారో లేదో.. ఇలా కొన్ని గంటల వ్యవధిలో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. మిర్చి రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాయడం ఏపీలో ఆసక్తికరంగా మారింది. అలా ప్రతిపక్ష నాయకుడు నిరసన చేపట్టగా.. ఇలా అధికార పక్షం స్పందించడం ఆహ్వానించదగిన పరిణామం.
Also Read: YS Sharmila: మాజీ సీఎం జగన్‌కు అంత దమ్ము, ధైర్యం లేదు: వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మిర్చి రైతులను ఆదుకుని.. వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు లేఖలో చంద్రబాబు కోరారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వెంటనే మిర్చి పంటను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులు అమ్ముకునే ధరకు, సాగు వ్యయానికి మధ్య పొంతన ఉండటం లేదని ఈ సందర్భంగా లేఖలో చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Also Read: VCs Appointments: ఏపీ గవర్నర్ కీలక నిర్ణయం.. 9 విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకం
ఏపీలోని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మిర్చి రైతులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో మిర్చి రైతుల పరిస్థితి, ధరల పతనంపై జరిగిన సమావేశం వివరాలను ఈ సందర్భంగా చంద్రబాబు లేఖలో గుర్తుచేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను కూడా సమర్పించినట్లు సీఎం వెల్లడించారు. పదేళ్లలో మిర్చి ఉత్పత్తి, ధరల వివరాలను కూడా లేఖలో తెలిపారు.
ఇటీవల కాలంలో మిర్చి ధరలు బాగా పడిపోయాయని సీఎం చంద్రబాబు తెలిపారు. సాధారణ మిర్చి క్వింటాల్‌కు రూ.11 వేలు, ప్రత్యేక వెరైటీ మిర్చి క్వింటాలు రూ.13 వేలకు పడిపోయిందని లేఖలో వివరించారు. గతంలో మిర్చి ధర రూ.20 వేలు ఉండేదని గుర్తుచేశారు. విదేశాలకు మిర్చి ఎగుమతి తగ్గిపోవడం కూడా ఈ పరిస్థితికి ఒక కారణమని చెప్పారు. మిర్చి ధరలు బాగా తగ్గిపోవడంతో రైతులకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అమ్ముకునే ధరకు, సాగు వ్యయానికి మధ్య పొంతన ఉండటం లేదని.. 50 శాతం నిష్పత్తిలో కాకుండా 100 శాతం నష్టాన్ని కేంద్రం భరించాలని లేఖలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.