Godavari Floods: గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద అంతకంతకూ పెరుగుతోంది. భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగానే..ధవళేశ్వరం వద్ద కూడా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి అత్యంత భారీ వర్షాలు సైతం కురుస్తున్నాయి. తెలంగాణలోని చాలా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. తెలంగాణలో అసాధారణ వర్షపాతం నమోదవుతోందని అంచనా. మరోవైపు గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన మహారాష్ట్రలో సైతం భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో గోదావరి నదికి ఎగువ నుంచి పెద్దఎత్తువ వరద పోటెత్తుతోంది. నిన్న రాత్రి భద్రాచలంలో రెండవ ప్రమాద హెచ్చరిక, ధవళేశ్వరంలో తొలి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యాయి. ఇవాళ వరద ఉధృతి పెరగడంతో కాస్సేపటి క్రితం ధవళేశ్వరంలో కూడా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 14 అడుగులకు చేరుకుంది. కాటన్ బ్యారేజ్ మొత్తం 175 గేట్లు ఎత్తి 14 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఇది కాకుండా పంట కాల్వలకు 4 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.
ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో గోదావరి తీరం ప్రమాదకరంగా మారింది. కోనసీమలోని గౌతమి, వశిష్ట, వైనతేయ, వృద్ధ గౌతమీ పాయలు పోటెత్తుతూ లంక గ్రామాల్లోకి నీరు చేరుకుంటోంది. పి గన్నవరం ఆక్విడెక్ట్ వద్ద వరద పోటెత్తుతోంది. అటు అయినవిల్లి సమీపంలోని ముక్తేశ్వరం కాజ్‌వేపై నుంచి వరద నీరు పారుతుండటంతో గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.
రేపు మధ్యాహ్నం వరకూ గోదావరి వరద ఉధృతి మరింత పెరగనుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చు. భద్రాచలం వద్ద నీటిమట్టం నెమ్మదిగా తగ్గుతుండటంతో రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకోవచ్చు. ధవళేశ్వరం వద్ద మాత్రం రెండవ ప్రమాద హెచ్చరిక రేపు మద్యాహ్నం వరకూ కొససాగనుంది.
Also read: Heavy Rains Alert: ఏపీలో మరో మూడ్రోజులు అతి భారీ వర్షాలు, ఆగస్టు 2న మరో అల్పపీడనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook