Allu Arjun Political Support To Pawan Kalyan: గతంలో రెండు చోట్ల ఓడిపోయిన జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో గెలవాలనే కసితో ఉన్నారు. టీడీపీ, బీజేపీతో కలిసి పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ తన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తుండగా సినీ పరిశ్రమ నుంచి కూడా మద్దతు పొందుతున్నారు. అతడి గెలుపు కోసం సినీ పరిశ్రమ కదిలి వస్తోంది. ఇప్పటికే చిరంజీవి, సినీ నటులు నాని, రాజ్ తరుణ్‌తోపాటు దర్శక నిర్మాతలు, సినీ, బుల్లితెర నటులు మద్దతు ప్రకటిస్తుండగా.. తాజాగా మేనల్లుడు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించారు.
తన మామయ్య రాజకీయాలపై తొలిసారిగా బన్నీ స్పందించారు. ఎన్నికల సమయం దగ్గరకు వస్తుండడంతో 'ఎక్స్' వేదికగా తన మద్దతు ప్రకటించారు. 'పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు ఎంచుకున్న మార్గం, సే చేయాలన్న నిబద్ధతకు నేను ఎంతో గర్విస్తున్నా. ఒక కుటుంబసభ్యుడిగా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి. మీ ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నా' అని 'ఎక్స్'లో బన్నీ పోస్టు చేశారు.
Also Read: Chiranjeevi: పవన్‌ను చూస్తే గుండె తరుక్కుపోతుంది.. ఓటేసి గెలిపించండి చిరంజీవి పిలుపు
పిఠాపురంలో ఎలాగైనా పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని మెగా కుటుంబం రంగంలోకి దిగింది. ఇప్పటికే వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. బుల్లి తెర నటులు సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రామ్‌ప్రసాద్‌తోపాటు ఇతరులు పిఠాపురంలోనే మకాం వేసి పవన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. జానీ మాస్టర్, పృథ్వీ ఇతర దర్శక నిర్మాతలు పవన్‌కు మద్దతునిస్తున్నారు. ఇటీవల హీరో నాని, రాజ్ తరుణ్ కూడా పవన్‌కు అండగా నిలుస్తూ ట్విటర్‌లో పోస్టులు చేశారు.
పక్కా ప్రణాళిక ప్రకారం..
ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి వస్తున్న మద్దతు చూస్తుంటే ఇది ముందస్తు ప్రణాళిక అని తెలుస్తోంది. పోలింగ్ సమయానికి సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించేలా జనసేన, టీడీపీలు ప్రణాళిక వేసుకున్నాయని ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో అగ్రతారల నుంచి కూడా పవన్ కల్యాణ్ ఎన్నికకు సంబంధించి ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. సినీ తారలు పవన్‌కు మద్దతునివ్వడంపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తేలికగా తీసుకుంటున్నారు. సినీ తారలు పవన్ వెంట.. ప్రజలు మా వెంట అని పేర్కొంటున్నారు. పిఠాపురంలో వంగా గీత గెలవడం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter