Minister Roja: వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సున్నా.. పవన్ ఓడిపోతే అదే చేయాలి.. మంత్రి రోజా సెటైర్లు

Minister Roja Counter to Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితిపై మంత్రి రోజా జోస్యం చెప్పారు. ఎన్ని సీట్లు కూడా వస్తాయో కూడా ముందే చెప్పేశారు. పవన్ కళ్యాణ్‌కు సైతం కౌంటర్ ఇచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2022, 01:12 PM IST
  • పవన్ కళ్యాణ్‌కు మంత్రి రోజా కౌంటర్
  • తెలుగుదేశం పార్టీకి వచ్చే సీట్లు సున్నా
  • అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం
Minister Roja: వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సున్నా.. పవన్ ఓడిపోతే అదే చేయాలి.. మంత్రి రోజా సెటైర్లు

Minister Roja Counter to Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు వస్తే చూస్తు కూర్చుంటామా..? అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోతే.. 2019 ఎన్నికల సమయంలో ఓడిపోయినప్పుడు ఏం చేశాడో అదే చేయాలని సూచించారు. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఓడిపోయినప్పుడు పవన్ చేశారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చే సీట్లు సున్నా అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబును చూసి రాష్ట్రంలోని ప్రజలు ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు మంత్రి రోజా. కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో అయినా.. అడ్డమైన యాత్రలు మానేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని.. అధికార వికేంద్రీకరణతోనే అది సాధ్యమన్నారు. రాజధాని అమరావతి పేరుతో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుకున్న కోట బద్ధలు అవుతోందన్నారు. రైతులు అమరావతి-అరసవెల్లి పాదయాత్రను ఆపేయాలని మంత్రి సూచించారు. 

ఈ సందర్భంగా టీడీపీ మహిళా నాయకురాలు వంగలపూడి అనితపై కూడా రోజా ఫైర్ అయ్యారు. పాయకరావుపేట, కొవ్వూరు ప్రజలు ఆమెను చీత్కరించుకుని ఎన్నికల్లో ఓడించారని అన్నారు. తాను పన్నెండళ్ల నుంచి నగరిలో ఉన్నానని.. అందుకే ప్రజలు తనను ఆదరిస్తున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి నాయక నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. 

మరోవైపు జగనన్న క్రీడా సంబురాలు, జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబురాల కార్యక్రమాలతఓ మంత్రి రోజా బిజీగా ఉన్నారు. రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన కళలను భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకునే విధంగా నాలుగు జోన్‌లలో ఈ సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళామతల్లి ముద్దుబిడ్డలు గోదావరి జిల్లాల కళాకారులేనని కొనియాడారు. అనంతరం వేదికపై కళాకారులతో మంత్రి రోజా డ్యాన్స్ చేసి సందడిగా గడిపారు. 

Also Read: Ind Vs NZ: ముగిసిన భారత్ ఇన్నింగ్స్.. కివీస్‌కు ఈజీ టార్గెట్

Also Read: IFruits for Uric acid: ఈ పండ్లతో యూరిక్ యాసిడ్‌ సమస్యలు శాశ్వతంగా మటు మాయం..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News